అధిక వర్షం.. అపార నష్టం

ABN , First Publish Date - 2021-07-24T06:59:33+05:30 IST

జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షంతో అపార నష్టం జరిగింది. జిల్లాలోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి.

అధిక వర్షం.. అపార నష్టం
సిరికొండ మండలం గడ్కోల్‌ వద్ద తెగిపోయిన చెక్‌డ్యాం కరకట్ట ఇలా..

భారీ వర్షంతో జిల్లా అతలాకుతలం
పొంగిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు
జిల్లావ్యాప్తంగా 4,126 హెక్టార్లలో పంటనష్టం
గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
రంగంలోకి దిగిన మంత్రి వేముల, కలెక్టర్‌
అవసరమైన చోట సహాయక చర్యలు

నిజామాబాద్‌, జూలైౖ 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షంతో అపార నష్టం జరిగింది. జిల్లాలోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. సోయా, వరి, మొక్కజొన్న పంటలకు అధిక నష్టం వాటిల్లింది. పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 14 మండలాల పరిధిలో 105 గ్రామాల్లో 5,911 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతినాయి. 2,889.8 హెక్టార్లలో 33శాతం, 1,23 6.6 హెక్టార్లలో 33శాతానికి తక్కువగా పంటలు దెబ్బతిన్న ట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో ఎక్కువగా వరి పంట దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా 2,161.8 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు అధి కారులు అంచనా వేశారు. అలాగే, సోయాబీన్‌ 395.42 హె క్టార్లలో, మొక్కజొన్న 333.27 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాథమిక అంచనా నివేదికను ప్రభుత్వానికి ప ంపించారు. భారీ వర్షంతో సో యా పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండు రోజులుగా పంట నీళ్లల్లోనే ఉండ డం.. ఇప్పటికీ జల్లులు కురుస్తుండడంతో పెద్దఎత్తున పం ట దెబ్బతింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నాట్లు వేసిన వరి పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి, ఎంతో శ్రమకోర్చి వేసిన నాట్లు వర్షార్పర్ణం కావడంతో పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమ అంతా వృథా గా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే స్పందించి సహాయం చేయాలని కోరుతున్నారు.
పొంగిన కుంటలు.. దెబ్బతిన్న రోడ్లు
జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, చెక్‌డ్యాంలు, వాగులు, కుంటలు పొంగి రోడ్లపై పారడంతో పలు ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల గండ్లు పడ్డా యి. జిల్లాలో 968 చెరువులు ఉండగా.. వీటిలో 450కి పైగా  నిండాయి. అందులో కొన్ని అలుగులు పారాయి. భీంగల్‌లో ని చెరువు తెగిపోవడంతో కాలనీలకు నీళ్లు చేరాయి. అలాగే, ముచ్కూర్‌, ఉప్లూర్‌, కొండైర్‌, ధర్మోరా, పోచంపల్లి, మోర్తాడ్‌ లో పంచాయతీ రాజ్‌ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. అదే విధంగా వర్షాలకు జిల్లాలో పలుచోట్ల కొన్ని ఇళ్లు కూలిపోయాయి. 102 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఐదు పశువు లు చనిపోయాయి.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
జిల్లాలో భారీ వర్షాలు కురిసి పెద్దఎత్తున నష్టం వాటిల్లడంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. కలెక్టర్‌ నారాయణరెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించారు. రెండు రోజులుగా వరద నష్టంపై సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయమే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వద్దకు వెళ్లి వరదను పరిశీలించి అధికారులతో చర్చించారు. మహారాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచా రం తెలుసుకుంటూ వరద గేట్ల ద్వారా నీటిని వదలాలని అధికారులకు సూచించారు. అలాగే, జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయ, పంచాయ తీ, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పోలీసు అధి కారులు గ్రామాలలో పర్యటించారు. వరద వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ముప్కాల్‌, ఆర్మూర్‌, మెండోరా, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, వేల్పూర్‌, భీంగల్‌, సిరికొండ మండలాలలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశా రు. మంజీరా బ్యాక్‌ వాటర్‌, గోదావరి పరీవాహక ప్రాంతాలలోనూ వరద తీరును పరిశీలిస్తున్నారు. అవసరమైన చో ట సహాయక చర్యలు చేపడుతున్నారు. పంట నష్టంతో పా టు ఇతర నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం తో ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్య బృందాలు పర్యటిం చాలని ఆదేశించారు.
జిల్లాను వదలని వర్షం
జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు భారీగానే వర్షం కు రిసింది. సాయంత్రం నుంచి మళ్లీ మొదలైంది. జిల్లా అంత టా 99.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికం గా ఏర్గట్ల మండల కేంద్రంలో 169.9 మి.మీ. వర్షం కురిసిం ది. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో సాధారణ వర్షానికి మించి వర్షం కురిసింది.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం..
- కలెక్టర్‌ నారాయణరెడ్డి

జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టాం. రవాణా, విద్యుత్‌, సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. జి ల్లాలోని అన్ని గ్రామాలలో అధికారులతో సహాయక చర్యలు చేపట్టాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాల ం ప్రారంభమైనందున అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 33 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండడం తో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.   శుక్ర వారం గోదావరితోపాటు వాగుల ద్వారా 2లక్షల 15వేల 067 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 33 గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు తగ్గి  వరద తగ్గినా మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టు ల నుంచి వరద వస్తుండడంతో నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడు గులు(90టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,089.90అడుగు (84.291 టీఎంసీలు)లకు చేరింది.  ప్రాజెక్టు వరద కొనసాగుతుండడంతో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. నా లుగు టర్బైన్‌ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఎస్సారెస్పీకి మరికొన్ని రోజుల పాటు వరద కొ నసాగుతుందని ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపా రు. వరదను బట్టి గేట్లను పెంచడం, తగ్గించడం చేస్తామని వారు తెలిపారు.
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుపైకి పర్యాటకులు రావద్దు : కలెక్టర్‌ నారాయణరెడ్డి
మెండోర: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని ప్రాజెక్టుపైకి పర్యాటకులు రావద్దని కలెక్టర్‌ నారాయ ణరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ప్రాజెక్టు వద్దకు వ చ్చి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను ప్రాజెక్టు అధికారులను అడి గి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు వరద నీటి తో నిండుకుండలా మారిందని, దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ సమ యంలో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి పర్యాటకులకు ఎటువంటి అనుమతి లేదని, ప్రాజెక్టు గేట్ల వద్దకు కూడా ఎ వరూ రావద్దని, గోదావరి నది తీరాన పర్యటించవద్దని, నది లోకి కూడా దిగవద్దని తెలిపారు. పర్యాటకులు అధికారులకు సహకరించాలని కోరారు.

Updated Date - 2021-07-24T06:59:33+05:30 IST