ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ.. గంటకు రూ.3,600 జీతం.. Software Engineer లకు కాదు.. పారిశుద్ధ్య కార్మికులకు..!

ABN , First Publish Date - 2022-07-21T17:46:56+05:30 IST

పారిశుద్ధ్య కార్మికుల(Sanitation Workers) కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. గంటకు రూ. 3600 జీతంతో ఏడాదికి సగటున కోటి రూపాయ ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా కొన్ని సంస్థలు వెనకాడటం

ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ.. గంటకు రూ.3,600 జీతం.. Software Engineer లకు కాదు.. పారిశుద్ధ్య కార్మికులకు..!

ఇంటర్నెట్ డెస్క్: పారిశుద్ధ్య కార్మికుల(Sanitation Workers) కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. గంటకు రూ. 3600 జీతంతో ఏడాదికి సగటున కోటి రూపాయ ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా కొన్ని సంస్థలు వెనకాడటం లేదు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. పారిశుద్ధ్య కార్మికులకు భారీ మొత్తంలో ప్యాకేజీలను సంస్థలు ఎందుకు ఆఫర్ చేస్తున్నాయి. వారికి ఇంత డిమాండ్ ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..


సాధారణంగా మంచి ప్రతిభగల Software Engineer‌లకు కొన్ని సంస్థలు భారీ మొత్తంలో జీతాలను ఆఫర్ చేస్తాయి. కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడవన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో కొన్ని సంస్థలు పారిశుద్ధ్య కార్మికులకు పెద్ద మొత్తంలో జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో sanitation వర్కర్లు గంటకు రూ.3,600 చొప్పున నెలకు సగటున రూ.8లక్షలు.. ఏడాదికి ఏకంగా సుమారు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. 



2021 నుంచి Australia‌లో Sanitation Workerల కొరత విపరీతంగా వేధిస్తోందట. అందువల్లే Sanitation పని చేసే వారికి ఇంతటి డిమాండ్ ఏర్పడిందని సిడ్నీ కేంద్రంగా పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ Absolute Domestics ఎండీ జో వెస్ (Joe Wes) స్పష్టం చేశారు. గతంలో Sanitation Worker‌లకు గంటకు రూ.2,700 లెక్కన చెల్లించినట్టు పేర్కొన్నారు. కార్మికుల కొరత కారణంగా గంటకు $45 (సుమారు రూ3,600) చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని కంపెనీలు కార్మికులకు గంటకు రూ.4,700 చెల్లించేందుకు కూడా రెడీగా ఉన్నాయట. 


Updated Date - 2022-07-21T17:46:56+05:30 IST