బాబా ఆలయానికి భారీ విరాళం

ABN , First Publish Date - 2021-06-18T07:10:29+05:30 IST

పట్టణ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయ అభివృద్ధి కోసం పలువురు భక్తులు భారీ విరాళాలను అందజేశారు.

బాబా ఆలయానికి భారీ విరాళం
ఆలయానికి విరాళాలు అందజేస్తున్న భక్తులు

అన్నదాన షెడ్డు కోసం రూ. 5 లక్షలు అందజేసిన సాగర్‌ రావు

ఆలయ అభివృద్ధికి మరో రెండు లక్షలు అందజేసిన దాతలు

నిర్మల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : పట్టణ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయ అభివృద్ధి కోసం పలువురు భక్తులు భారీ విరాళాలను అందజేశారు. ఈ మేరకు గురువారం సాయిబాబా ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ సింగిల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డికి దాతలు తమ విరాళాలను చెక్కులరూపంలో అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దాతలకు ఆలయ పూజారులు తీర్థప్ర సాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ కె.విద్యాసాగర్‌రావు ఆల య ఆవరణలో నిర్మించే అన్నదాన షెడ్డు కోసం రూ. 5 లక్షలను అంద జేశారని తెలిపారు. ఆయనకు ఆలయం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలి  పారు. అలాగే పట్టణానికి చెందిన వ్యాపారి ముత్యం సంతోష్‌ గుప్తా ఆలయ అభివృ ద్ధి పనుల కోసం లక్షా 11 వేల 111 రూపాయలను, మరో వ్యాపారి ఆమెడ శ్రీధర్‌ రూ. 50 వేలు, స్థానిక భక్తుడు ఎస్‌. నర్సారెడ్డి రూ. 50 వేలను ఆలయ అభివృద్ధి కోసం అందజేయడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం దాత లు ఇంత పెద్ద ఎత్తున స్పందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దాతలకు బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆలయ అభివృద్ధికి లక్షలాది రూపాయల నిధులను మంజూరు చేశారని తెలిపారు. ఆయా నిధులతో ఆలయ ప్రహరీ నిర్మాణంతో పాటు గ్రీనరీ, అలంకరణ పనులను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు గోపాల్‌రెడ్డి, కందుల పండ రి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T07:10:29+05:30 IST