UAE లో ఇకపై ఆ ఫొటోలు, వీడియో తీస్తే జైలుకే..!

ABN , First Publish Date - 2022-03-04T15:57:21+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన వారి ఫొటోలుగానీ, వీడియోలుగానీ చిత్రీకరిస్తే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్‌ క్రైం చట్టాన్ని యూఏఈ సవరించింది.

UAE లో ఇకపై ఆ ఫొటోలు, వీడియో తీస్తే జైలుకే..!

అబుదాబి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన వారి ఫొటోలుగానీ, వీడియోలుగానీ చిత్రీకరిస్తే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్‌ క్రైం చట్టాన్ని యూఏఈ సవరించింది. ఇటీవల సవరించిన సైబర్‌క్రైం చట్టం ప్రకారం ఇకపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన లేదా చనిపోయిన వారి ఫొటోలు, వీడియో తీయడం నేరం. దీనికి గాను ఆరు నెలల జైలు లేదా రూ.31లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు విధించవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2022 జనవరి 2 నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రమాద బాధితుల గోప్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ నేరాలకు వ్యతిరేకంగా సమాజ రక్షణను మెరుగుపరచడానికి ఈ చట్టం ఉద్దేశించబడిందన్నారు. అలాగే కొత్త చట్టం ప్రకారం ఆన్‌లైన్‌లో వ్యక్తుల పొజిషన్‌లు, లొకేషన్‌లను ట్రాక్ చేసి వాటిని ఇతరులకు పంపించే వారు కూడా శిక్షార్హులని తెలిపారు. అలా చేసేవారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.31లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా లేదా రెండింటినీ విధించవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-04T15:57:21+05:30 IST