Viral Video: ఢిల్లీ ఆర్‌టీసీ బస్సులో భారీగా మంటలు

ABN , First Publish Date - 2022-04-07T02:19:40+05:30 IST

బుధవారం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌(డీటీసీ)కు చెందిన 534 (ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీ నుంచి మెహ్రౌలి) రూట్‌లో నడిచే ఒక బస్సు మహిపాల్పుర్ ప్రాంతంలోకి రాగానే మద్యాహ్నం 2:20 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న ఫైర్..

Viral Video: ఢిల్లీ ఆర్‌టీసీ బస్సులో భారీగా మంటలు

న్యూఢిల్లీ: ఢిల్లీ నడిరోడ్డులో ఒక ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. చూస్తుండగానే భారీ మంటల్లో బస్సు చిక్కుకపోయింది. అయితే ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. కాకపోతే రోడ్డు పక్కన ఉన్న రెండు వ్యాపార దుకాణాలు మాత్రం కొంత వరకు దెబ్బతిన్నాయట. అగ్ని ప్రమాదానికి గురైన బస్సు సమీపంలో ఉండడం, గాలులు బాగా వీడయంతో దుకాణాలపై ఆ ప్రభావం పడింది.


బుధవారం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌(డీటీసీ)కు చెందిన 534 (ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీ నుంచి మెహ్రౌలి) రూట్‌లో నడిచే ఒక బస్సు మహిపాల్పుర్ ప్రాంతంలోకి రాగానే మద్యాహ్నం 2:20 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, వచ్చి మంటలు ఆర్పారు. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియదని అధికారులు అంటున్నారు. కాగా, మిన్నంటిన మంటల నడుమ దగ్ధమవుతున్న బస్సు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2022-04-07T02:19:40+05:30 IST