పసిడి దిగుమతుల జోరు..

ABN , First Publish Date - 2021-07-26T07:11:28+05:30 IST

పసిడి దిగుమతులు మళ్లీ చుక్కలంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 790 కోట్ల డాలర్లకు (సుమారు రూ.58,572.99 కోట్లు) చేరాయి...

పసిడి  దిగుమతుల జోరు..

  • క్యూ1లో పది రెట్ల పెరుగుదల 

న్యూఢిల్లీ : పసిడి దిగుమతులు మళ్లీ చుక్కలంటాయి. ప్రస్తుత ఆర్థిక  సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 790 కోట్ల డాలర్లకు (సుమారు రూ.58,572.99 కోట్లు) చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతైన 68.8 కోట్ల డాలర్లతో (సుమారు రూ.5,208.41 కోట్లు) పోల్చితే  పది రెట్లు  పెరిగాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు 3.94 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 97 శాతం తక్కువ. పసిడి దిగుమతుల జోరుతో ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వాణిజ్య లోటు 3,100 కోట్ల డాలర్లకు చేరింది.

Updated Date - 2021-07-26T07:11:28+05:30 IST