భారీ గుంతలతో అవస్థలు

ABN , First Publish Date - 2022-08-18T06:32:38+05:30 IST

మారేడుమిల్లి, గుర్తేడు ప్రధాన రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

భారీ గుంతలతో అవస్థలు
మారేడుమిల్లి-గుర్తేడు ప్రధాన రహదారి

  • అధ్వానంగా మారేడుమిల్లి-గుర్తేడు ప్రధాన రహదారి

 మారేడుమిల్లి, ఆగస్టు 17: మారేడుమిల్లి, గుర్తేడు ప్రధాన రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోతవరం గ్రామానికి 6 కిలోమీటర్ల సమీపంలో గొడుగుమామిడి, టెంకలగడ్డ గ్రామ సమీపంలో రహదారికి అడ్డంగా పెద్ద గొయ్య ఏర్పడటంతో వాహనాలు అటువైపుగా తిరగడం కష్టతరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీళ్లు నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. సుమారు ఐదు పంచాయతీ గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి గుండా ప్రయాణించాల్సి ఉంది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌ సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఆయా గ్రామాల గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.22 కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ పనులు పూర్తికాలేదు. ఇప్పటికే ఆ రోడ్డుకు కేటాయించిన నిధులలో యర్త్‌వర్క్‌పేరుతో సుమారు 40-50 శాతం నిధులను కాంట్రాక్టర్లకు అధికారులు ముట్టజెప్పారు. ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి మొత్తం పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో ఇప్పటివరకు చెల్లించిన నిధులు రోడ్డుపాలయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ రోడ్డు పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరితగతిన ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2022-08-18T06:32:38+05:30 IST