
కడప: జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో 13 మంది సర్పంచ్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించినందుకు నిరసనగా సర్పంచ్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు.
