భారీగా పెరిగిన ఎరువుల ధరలు!

ABN , First Publish Date - 2021-03-06T04:51:25+05:30 IST

జిల్లా రైతులకు ఎరువులు మరింత భారం కానున్నాయి. ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్‌ ధరలు పెంచడం వల్ల రైతులపైన అదనపు భా రం పడనుంది.

భారీగా పెరిగిన ఎరువుల ధరలు!

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పైపైకి

జిల్లా రైతులపై రూ.22 కోట్లకుపైగా అదనపు భారం

నిజామాబాద్‌, మార్చి 5: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా రైతులకు ఎరువులు మరింత భారం కానున్నాయి. ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్‌ ధరలు పెంచడం వల్ల రైతులపైన అదనపు భా రం పడనుంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల కాంప్లెక్స్‌ ధరలు పెంచామని ఎరువుల కంపెనీలు ప్రకటించి నా.. రైతులు తప్పనిసరి ఈ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్ప డింది. యాసంగి సాగు వెనకకు వచ్చినా వచ్చే వానాకాలం సాగు మాత్రం కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగించే రైతులపైన అదనపు భారం పడనుంది. ఎరువుల ధరలు పెంచిన కంపెనీలు కొత్త రే టు ప్రకారమే అమ్మేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లా అధికారులు కూడా ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను పాత రేట్లకే అమ్మేవిధం గా చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు స్టాక్‌ను తరలించకుండా నిఘా పెట్టారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే కాంప్లెక్స్‌ ఎరువులకు సబ్సిడీ ఎత్తివేసింది. సబ్సిడీ లేకపోవడం వల్ల ఎ రువుల కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువులకు ధరలు పెంచి అ మ్మకాలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా కాంప్లెక్స్‌ ఎరు వులకు ఉపయోగించే పాస్పారిక్‌ ఆమ్లంతో పాటు ఇతర అమ్మోనియంకు సంబంధించిన ముడి సరుకు ధరను పెంచడం వల్ల కంపెనీలు ఎరువుల ధరలను మళ్లీ పెం చాయి. ఒక్కొక్క కాంప్లెక్స్‌ బస్తాపైన 200ల రూపాయలకుపైగా ధరను పెంచాయి. దీంతో రైతులపైన భార ం పెరిగింది. జిల్లాలో అత్యధికంగా వినియోగించే యూరియాకు కేంద్రం సబ్సిడీ ఇస్తున్నందున ప్రస్తు తం ధర పెరగకున్నా కాంప్లెక్స్‌ ఎరువుల ధర మా త్రం భారీగా పెరగడంతో రైతులపైన భారం అధి కం కానుంది. జిల్లాలో వరితో పాటు ఆరుతడి ప ంటలను రైతులు సాగుచేస్తున్నారు. ఈ పంటల కు సేంద్రియ ఎరువులకన్నా ఎక్కువగా ఈ కా ంప్లెక్స్‌ ఎరువులనే బాగా ఉపయోగిస్తున్నారు. రెండు పంటలకు వానాకాలం యాసంగిలో భారీగా ఎరువులను వాడుతున్నారు. జిల్లాలో ప్రతి సీజన్‌లో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వర కు ఎరువులను వినియోగిస్తున్నారు. వీటి లో లక్షకు పైగా మెట్రిక్‌ టన్నుల మేరా యూరియాను వినియోగిస్తుండగా అదే స్థాయిలో కాంప్లెక్స్‌ ఎరువులనూ ఉపయోగిస్తున్నారు. జిల్లాలో వరితో పాటు మొ క్కజొన్న, ఎర్రజొన్న, సజ్జ, సోయా, పసుపు పంటలకు కాంప్లెక్స్‌ ఎరువులను ఉప యోగిస్తున్నారు. ప్రస్తుతం ఎరువుల ధరలు యూరియా బస్తాకు 266 రూపాయ లు ఉంది. ఈ యూరియాకు కేంద్రం సబ్సిడీ ఇస్తుండడం వల్ల ప్రస్తుతం ధర పె రగడంలేదు. కాంప్లెక్స్‌ ఎరువులకు మాత్రం భారీగా పెరిగింది. డీఏపీ ప్రస్తుతం రూ.1,225 నుంచి రూ.1,250ల మధ్య ఉండగా రూ.200లు పెంచారు. పెరిగిన ధ రతో బస్తా రూ.1,450లు అయింది. పొటాష్‌ రూ.825 నుంచి రూ.850 మధ్య ఉం డగా రూ.150లు పెంచారు. కొత్త ధర వెయ్యి రూపాయలు అయింది. మరో కాం ప్లెక్స్‌ ఎరువైన 20.20.0.13 ధర రూ.950 ఉండగా రూ.200లు పెరిగి రూ.1,150 అయింది. కాంప్లెక్స్‌ ఎరువు 2828.0 రకం ప్రస్తుతం రూ.1,280 ఉండగా రూ.220 పెరిగి రూ.1500లు అయింది. మరో రకం ఎరువు 10.26.26కు ప్రస్తుతం రూ.1,18 0 ఉండగా రూ.320 పెరిగి రూ.1500లు అయింది. 

జిల్లా రైతులపై రూ.22 కోట్ల అదనపు భారం

పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరల వల్ల జిల్లా రైతులపై అదనంగా రూ.22 కో ట్లకుపైగా ప్రతీసీజన్‌లో భారం పడనుంది. ఎరువుల కంపెనీలు రేట్లు పెంచడం వల్ల ఈ భారం రైతులు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో పాటు ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై మరింత భారం పడుతోంది. వాహనాలను వినియోగించే రైతులందరికీ డీజిల్‌ భారం ఇప్పటికే పడింది. ఎరు వుల భారం పడడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడే రైతులకు పెట్టుబడులు మరింత భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడం వల్ల కంపెనీలు కూడా భారీగా ధరలను పెంచుతున్నాయి. పెరిగిన ఎరువుల ధ రలను అమలు చేసేందుకు కంపెనీలు నిర్ణయించడంతో వ్యవసాయ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. యాసంగి సాగు ముగుస్తున్నందున అవసరమున్న రైతులకు ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను బట్టి పాత రేట్లకే అమ్మేవిధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా చర్యలు చేపడు తున్నారు. డీలర్‌లు, సహకార సంఘాల వద్ద ఉన్న స్టాక్‌ను పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఎరువుల ధరలు పెరిగినా ప్రస్తుతం యాసంగి పంటకు కా వాల్సిన ఎరువులను రైతులు తీసుకున్నారని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ తెలిపారు. వచ్చే వానాకాలం సాగు నుంచి పెరిగిన ధరల భారం పడనుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం స్టాక్‌కు అనుగుణంగా అన్ని మండలాల పరిధిలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులను ఉంచామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-03-06T04:51:25+05:30 IST