ఊపిరి ఆగేవరకు మానవ హక్కులు వర్తిస్తాయి

ABN , First Publish Date - 2021-10-26T06:34:50+05:30 IST

కాకినాడ సిటీ, అక్టోబరు 25: పుట్టబోయే బిడ్డ మొదలు ఊపిరి ఆగేవరకు మానవ హక్కులు వర్తిస్తాయని, వీటి పరిరక్షణ కోసం అవసరమైతే పోరాడి సాధించుకోవచ్చని మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ పీజే సుధాకర్‌ తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి

ఊపిరి ఆగేవరకు మానవ హక్కులు వర్తిస్తాయి
కాకినాడ సమావేశంలో మాట్లాడుతున్న సుధాకర్‌

మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు సుధాకర్‌ 

కాకినాడ సిటీ, అక్టోబరు 25: పుట్టబోయే బిడ్డ మొదలు ఊపిరి ఆగేవరకు మానవ హక్కులు వర్తిస్తాయని, వీటి పరిరక్షణ కోసం అవసరమైతే పోరాడి సాధించుకోవచ్చని మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ పీజే సుధాకర్‌ తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం ఆయన కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన కొనసాగుతోందన్నా రు. ఈ హక్కుల్లో 30 రకాల వరకు మానవ జీవనానికి ముడిపడే విధంగా హక్కులు కల్పించారన్నారు. నివాసం, సంచారం, ఉద్యోగం, వ్యాపారం, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలే కాకుండా కడుపులో పుట్టబోయే బిడ్డకు కూడా జన్మించే హక్కు ఉందని, అందుకే అబార్షన్‌లు నిషేఽధమని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ప్రధానంగా పోలీసులు చేస్తున్నారని తమ అధ్యయనంలో తేలిందన్నారు. మానవ హక్కులపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా ఒక పుస్తకాన్ని రూపొందిస్తున్నారన్నారు. సమాజం మీద మక్కువతో మానవ హక్కుల పరిరక్షణపై కూడా సుదీర్ఘ అధ్యయనం చేసి ప్రత్యేక పట్టాలు పొందినట్టు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా వి.జనార్ధనాన్ని నియమించినట్టు సుధాకర్‌ వెల్లడించారు.  

Updated Date - 2021-10-26T06:34:50+05:30 IST