మొక్కలతోనే మానవ మనుగడ

ABN , First Publish Date - 2021-07-25T05:55:32+05:30 IST

మొక్కలతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెం గ్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆఫీసర్‌ క్లబ్‌లో మొక్కలు నాటారు. అనంతరం దేవాపూర్‌ అటవి ప్రాంతంలో మొక్కలు నాటారు.

మొక్కలతోనే మానవ మనుగడ
ఆదిలాబాద్‌లో మొక్కను నాటి నీళ్లు పోస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

- ఎమ్మెల్యే జోగు రామన్న
- కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పలుచోట్ల మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు

ఆదిలాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): మొక్కలతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెం గ్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆఫీసర్‌ క్లబ్‌లో మొక్కలు నాటారు. అనంతరం దేవాపూర్‌ అటవి ప్రాంతంలో మొక్కలు నాటారు. ఇటీవల ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నాటిన 3లక్షల 50వేల మొక్కలను విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డితో కలిసి పరిశీలించారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, రైతుబంధు అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రహ్లాద్‌, తదితరులున్నారు. అలాగే, మానవ సేవనే మాధవ సేవ అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. శనివారం మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా  టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మాట్లాడుతూ రిమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదానం చేపట్టి తమ సామాజిక బాధ్యతను చాటుకోవడం జరిగిందన్నారు.
 తలమడుగు: రైతుల సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైన సుంకిడిలో మార్కెట్‌యార్డు నిర్మాణం చేపట్టడమే ధ్యేయమని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావ్‌ అన్నారు. శనివారం మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో మొక్కలు నాటి అన్నదానం చేశారు.
ఉట్నూర్‌: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం స్థానిక ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. స్థానిక  ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ సమీపంలో ఉన్న నర్సరీలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌, డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌లతో పాటు ఎఫ్‌డీవో జాదవ్‌ రాహుల్‌కిషన్‌ మొక్కలు నాటారు.  
సిరికొండ: మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరిచుకుని మండలంలోని స్థానిక పల్లెప్రకృతి వనంలో సర్పంచ్‌ నర్మదా పెంటన్న, ఎంపీటీసీ పర్వీన్‌ లతీఫ్‌ ఆధ్వర్యంలో రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భం గా సర్పంచ్‌ నర్మదా మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినం సందర్బంగా కోటి వృక్షార్చ నలో భాగంగా మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి రెండు వేల మొక్కలు నాటామని ఆమె తెలిపారు. కార్యక్రమమంలో ఉపసర్పంచ్‌ తోకల చిన్న రాజన్న, వార్డు మెంబర్లు రాజన్న, లస్మన్న, ప్రభుత్వ పాఠశాల చైర్మన్‌ లక్ష్మణ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎగ్గిడి మల్లారెడ్డి, ఇస్తారి, జాకీర్‌గూడ గ్రామ పటేల్‌ కుమ్ర భీంరావ్‌ పటేల్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎక్బాల్‌, రంజానీ, ప్రకాశ్‌, నర్సయ్య, సంతోష్‌, లతీప్‌, అశోక్‌, కృష్ణయ్య, రాజేష్‌, రాజు, మూసా, అజ్గర్‌, సందీఫ్‌, అజ్గర్‌, నరేష్‌, భూమన్న, చిత్రు, భరత్‌, ఆదాం, సామాజిక కార్యకర్త గుగ్గిళ్ల స్వామి, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్‌: రాష్ట్ర ప్రభుత్వ సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన 7వ విడత హారితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జైనథ్‌ జడ్పీటీసీ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ జడ్పీ స్టాడింగ్‌ కమిటీ చైర్మన్‌ తుమ్మల అరుందతిరెడ్డి, జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌లు అన్నారు. శనివారం హారితహారం, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని మండలంలోని కంఠం గ్రామంలో అధికారులు, నాయకులతో కలిసి స్థానిక రైతు వేదిక భవనం ఆవరణలో మొక్కలను నాటారు.  
గుడిహత్నూర్‌: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముక్కొటి వృక్షార్చనలో భాగంగా సూర్యగూడ, సీతాగొందీ గ్రామాల్లో మొక్కలు నాటారు. రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీ హాజరై మొక్కలు నాటారు.  
భీంపూర్‌: మంత్రి కేటీఆర్‌ పేదల పెన్నిది అని భీంపూర్‌ ఎంపీపీ కుడిమెతరత్నప్రభ అన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శనివారం ఎంపీపీ బెల్సరిరాంపూర్‌తో పాటు పలు గ్రామాల్లో మొక్కలు నాటారు.
ఇచ్చోడ: మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు మండల టీఆర్‌ఎస్‌ నాయకు లు కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు మిఠాయిలు తినిపించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పల్లెప్రకృతి వనంలో 500 మొక్కలు నాటినారు.  
ఇచ్చోడ రూరల్‌:  మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం మండలంలోని బోరిగావ్‌ గ్రామంలో మొక్కలు నాటారు. అలాగే, స్థానిక హైస్కూల్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.  
తాంసి: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం తాంసి మండలంలోని ఆయా గ్రామాలలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జామిడి గ్రామంలో ఉపాధి పథకం కూలీల ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు.  
నార్నూర్‌: ప్రతిఒక్కరూ మొక్కలు నాటాడంలో బాగస్వాములుక ఆవాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకోని కోటి వృక్షార్చన కార్యక్రమంలో బాగంగా మండలంలోని తాడిహత్నూర్‌, మాన్కాపూర్‌, మండల కేంద్రంలోని ఏకలవ్య జూనియర్‌ కళాశాలలో మొక్కలు నాటారు.
 నేరడిగొండ: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యయమని ఎమ్యెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అన్నారు. శనివారం మండలంలోని కుప్టి గ్రామంలో మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినాన్ని పురష్కరించుకుని మొక్కలు నాటాలన్నారు. 

Updated Date - 2021-07-25T05:55:32+05:30 IST