యువతరంలో పరిమళించిన మానవత్వం

ABN , First Publish Date - 2021-05-26T09:47:13+05:30 IST

ఆపత్కాలంలో యువత ఆపద్భాంధవులే అవుతున్నారు. వైరస్‌ భయంతో సొంతవారే వదిలేసిన కరోనా మృతులకు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు జరుపుతున్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి స్ఫూర్తి గాథలెన్నో!

యువతరంలో పరిమళించిన మానవత్వం

ఆపత్కాలంలో యువత ఆపద్భాంధవులే అవుతున్నారు. వైరస్‌ భయంతో సొంతవారే వదిలేసిన కరోనా మృతులకు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు జరుపుతున్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి స్ఫూర్తి గాథలెన్నో! ఈ చిత్రం యువతరంలో పరిమళించిన మానవత్వానికి మరో నిదర్శనం. నిజానికి ఇది ఒక సాహసం. మహిళలు శ్మశానాలకు వెళ్లడం కొన్ని మతాచారాల్లో నిషిద్ధం. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి, దిక్కులేని శవాలకు తామే పెద్ద దిక్కై దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఈ యువతులు.


వీరిలో కుడి వైపున ఉన్నది అక్షయ. వయసు 22 సంవత్సరాలు. న్యాయశాస్త్ర విద్యార్థిని. ఆ పక్కన ఉన్నది ఎస్తర్‌ మేరీ. అక్షయ అధ్యాపకురాలు. ‘ఈ విపత్కాలంలో సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా వస్తున్న విజ్ఞప్తులు చూశాక మా మనసంతా బాధతో నిండిపోయింది. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగించాలన్న ఉద్దేశంతో ప్రాణాలకు ముప్పని తెలిసినా ఇంతటి సాహసానికి పూనుకున్నాం’ అంటున్న అక్షయ, ఎస్తర్‌ నేటితరంలో స్ఫూర్తి నింపుతున్నారు. 

Updated Date - 2021-05-26T09:47:13+05:30 IST