హంగ్‌ కర్డ్‌ పరోటా

ABN , First Publish Date - 2022-03-12T20:24:28+05:30 IST

హంగ్‌ కర్డ్‌ - మూడు కప్పులు, గోధుమపిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, బంగాళదుంపలు - రెండు, పనీర్‌ - ఒక కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం పేస్టు - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్‌, కారం -

హంగ్‌ కర్డ్‌ పరోటా

గట్టి పెరుగుతో... రుచులు ఘనం!

పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో పెరుగు వంటలు తింటే మంచిది. అయితే సాధారణ పెరుగుతో కాకుండా హంగ్‌కర్డ్‌తో చేసే కబాబ్స్‌, శాండ్‌విచ్‌, పరోట లాంటివి ట్రై చేస్తే ఒంటికి చలువతో పాటు జిహ్వ చాపల్యం తీరుతుంది. అలాంటి కొన్ని వంటల తయారీ విశేషాలు ఇవి. 


కావలసినవి: హంగ్‌ కర్డ్‌ - మూడు కప్పులు, గోధుమపిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, బంగాళదుంపలు - రెండు, పనీర్‌ - ఒక కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం పేస్టు - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాల - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ - ఒక టీస్పూన్‌, వాము - అర టీస్పూన్‌, కసూరి మేతి (ఎండిన మెంతి ఆకుల పొడి) - ఒక టీస్పూన్‌


తయారీ విధానం: ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి.  మెత్తటి మిశ్రమంలా కలుపుకొన్న తరువాత రెండు టీ స్పూన్ల నూనె వేసి మరోసారి కలుపుకొని, మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి.బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి గుజ్జుగా తయారు చేసుకోవాలి.  మరొక బౌల్‌లో హంగ్‌ కర్డ్‌ తీసుకుని అందులో ఒక కప్పు పనీర్‌ తురుము, బంగాళదుంపల గుజ్జు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కొత్తిమీర, పసుపు, కారం, గరంమసాల, జీలకర్రపొడి, ఆమ్‌చూర్‌, వాము, కసూరి మేతి, ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలి. దీంతో దహీ పనీర్‌ స్టఫ్‌ రెడీ అయినట్టే.ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న గోధుమపిండిని కొద్దిగా తీసుకుని పూరీలా కాస్త వెడల్పుగా  ఒత్తుకుని, మధ్యలో దహీ పనీర్‌ స్టఫ్‌ పెట్టాలి. తరువాత చివర్లు దగ్గరకు ఒత్తాలి. పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో పరోటా తయారుచేసుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి పరోటాలు కాల్చుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే హంగ్‌ కర్డ్‌ పరోటా రెడీ.


Updated Date - 2022-03-12T20:24:28+05:30 IST