కోవిడ్‌ ఆస్పత్రిలో ఆకలి కేకలు

ABN , First Publish Date - 2022-01-22T06:45:47+05:30 IST

కోవిడ్‌ బాధితులకు పెట్టే భోజనం చాలక నిరసన వ్యక్తం చేసిన వైనమిది. పూతలపట్టు మండలం ముత్తిరేవులు సమీపాన గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం 170 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

కోవిడ్‌ ఆస్పత్రిలో ఆకలి కేకలు
భోజనం ఆలస్యంగా రావడంపై బాధితుల నిరసన


భోజనం బాగాలేదంటూ నిరసన 

పూతలపట్టు, జనవరి 21: కోవిడ్‌ బాధితులకు పెట్టే భోజనం చాలక నిరసన వ్యక్తం చేసిన వైనమిది. పూతలపట్టు మండలం ముత్తిరేవులు సమీపాన గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం 170 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.అయితే రోగులకు సరిపోయినంత ఆహారం పెట్టకపోవడంతో పాటు భోజనం బాగుండకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.ఉదయం పూట ఉప్మాతో పెట్టే చట్నీ దేంతో తయారు చేశారో కూడా తెలియని విధంగా ఉండడంతో తినాలా వద్దా అని సందేహపడుతున్నారు.గురువారం మధ్యాహ్నం 3 గంటలవుతున్నా భోజనం పెట్టక పోవడంతో కొంతమంది సొమ్మసిల్లిపడిపోయారని సమాచారం.దీంతో రోగులు నిరసన వ్యక్తం చేయగా ఆస్పత్రి సిబ్బంది నచ్చజెప్పి భోజన ప్యాకెట్లు అందజేశారు.జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మండల కేంద్రాల్లో ఇంకెలా ఉంటుందో?

Updated Date - 2022-01-22T06:45:47+05:30 IST