వజ్రాల వేట

ABN , First Publish Date - 2022-05-21T04:45:44+05:30 IST

తొలకరి జల్లులు పడడంతో వజ్రాన్వేషణ మొదలైంది. శుక్రవారం మండలం లోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం వజ్రాలు వెతుక్కోవడం మొదలు పెట్టారు.

వజ్రాల వేట
వజ్రాల కోసం వెతుకుతున్న దృశ్యం

తుగ్గలి, మే 20: తొలకరి జల్లులు పడడంతో వజ్రాన్వేషణ మొదలైంది. శుక్రవారం మండలం లోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం వజ్రాలు వెతుక్కోవడం మొదలు పెట్టారు. అదృష్టం వరిస్తే కష్టాలన్నీ తీరుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పగలంతా పొలాల్లో వెతికి రాత్రి వేళల్లో బస్టాండ్‌, దేవాలయాల్లో తలదాచుకుంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం మొదలైతే వజ్రాన్వేషకులు ఈ ప్రాంతానికి వేల సంఖ్యల్లో తరలి వస్తుంటారు. 

ఫ పొలాలు నాశనమవుతాయని..

వర్షం పడినప్పుడు పొలాల్లో తిరిగితే గట్టిపడి పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాన్వేషకులకు ప్రతి ఏటా చెబు తున్నా వినడం లేదని వాపోతున్నారు. అందుకో సమే ఈ ఏడాది రైతులంతా కలిసి ఎకరాకు రూ.100 చొప్పున వేసుకుని పొలాలకు కాపలాదా రులను నియమిం చుకున్నట్లు సమాచారం. 

రెండు వజ్రాలు లభ్యం 

 వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఇద్దరి కూలీలకు రెండు విలువైన వజ్రాలు దొరికాయి. శుక్రవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరికి చెందిన ఇద్దరి వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి. ఒక వజ్రం రూ.45వేలు, జత కమ్మలు, మరో వజ్రాన్ని రూ.35 వేలకు స్థానిక వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలకరి జల్లులు కురిసినప్పుడు ఈ ప్రాంతాల్లో విరివిగా వజ్రాలు దొరుకుతుంటాయి.  


Updated Date - 2022-05-21T04:45:44+05:30 IST