నిర్లక్ష్యంపై వేటు!

ABN , First Publish Date - 2020-10-02T06:24:36+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో పాటు రైతు వేదికల

నిర్లక్ష్యంపై వేటు!

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లపై కలెక్టర్‌ల కొరడా

పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు

పనిచేయకపోతే షోకాజ్‌ నోటీసు జారీచేయడంతో పాటు సస్పెన్షన్‌

ఇప్పటికే ముగ్గురు సర్పంచ్‌లు, ముగ్గురు కార్యదర్శులు సస్పెన్షన్‌


కామారెడ్డి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):  రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో పాటు రైతు వేదికల నిర్మాణాలపై ఉభయ జిల్లాల కలెక్టర్‌లు ప్రత్యే క దృష్టి సారించారు. పనిచేయని పాలకులు, అధికారు లపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇద్దరు కలెక్టర్‌లు  గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పల్లెప్రగతిలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, హరితహారం లక్ష్యం పై అలసత్వం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు నోటీసులివ్వడంతో పాటు పలువురిని స స్పెండ్‌ చేస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఇప్పటివరకు ముగ్గురు సర్పంచ్‌లను, మరో ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్‌ చేశారు. కామారెడ్డి లో తాజాగా మరో ఇద్దరు కార్యదర్శులు, ఉపాధిహామీ ఏపీవోపై కలెక్టర్‌ శరత్‌ వేటు వేశారు. కలెక్టర్‌ల సుడి గాలి పర్యటనతో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్య దర్శుల పనితీరు అలసత్వం భయటపడుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం ఉ భయ జిల్లాల్లో చర్చనీయంశంగా మారింది.


కొత్తచట్టంతో పదవీ గండం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం-2018 సర్పంచ్‌ పదవిపై కత్తిలా వేలాడు తోంది. నిధుల దుర్వినియోగంతో పాటు అభివృద్ధి ప నుల అమలులో నిర్లక్ష్యం వహించినా పదవిగండం త ప్పదు. ఇందులోని సెక్షన్‌ 37 సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల తో పాటు పంచాయతీ కార్యదర్శులనూ సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్‌కు కట్టబెట్టింది. పంచాయితీ రాజ్‌ కొత్తచట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత పాలకుల్లో మా ర్పు కనిపిస్తోంది. గతంలో కనీసం పట్టించుకోని సర్పం చ్‌లు సైతం ఎంతో కొంత పనులు చేయిస్తున్నారు. ఇక పల్లెప్రగతిని చేపట్టిన తర్వాత ప్రభుత్వం సర్పంచ్‌లపై మరింత భాద్యతలను మోపింది. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయోద్దని స్పష్టంగా చెప్పింది. పనితీరు మా ర్చుకోకపోతే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పై నిర్లక్ష్యం వహిస్తే పదవుల రద్దు చేయవచ్చని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. 


126 మంది సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 126 మంది సర్పంచ్‌లకు కలెక్టర్‌ల ఆదేశాలతో పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ని జామాబాద్‌ జిల్లాలో 530 గ్రామపంచాయతీలు ఉన్నా యి. ఇందులో పలు గ్రామపంచాయతీలలో పల్లె ప్రగ తి కార్యక్రమాలలోని పారిశుధ్య పనులు, డంపింగ్‌ యార్డు, హరితహారం, మంకి పుడ్‌కోర్ట్‌, వైకుంఠధామా ల పనులలో నిర్లక్ష్యం వహించిన 99మంది సర్పంచ్‌ల కు, కార్యదర్శులకు నోటిసులు జారీచేశారు. ఇద్దరు స ర్పంచ్‌లను, ఉప సర్పంచ్‌లను స్థానిక కలెక్టర్‌ నారా యణరెడ్డి సస్పెండ్‌ చేయగా ఒక పంచాయతీ కార్యద ర్శిపై వేటు వేశారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 526 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులోని పలు పం చాయతీలలో నిర్లక్ష్యం వహించిన, పనితీరు భాగాలేని ఒక సర్పంచ్‌, ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా 24 మంది సర్పంచ్‌లకు, ఏడుగురు ఉప సర్పంచ్‌లు, 10 మంది కార్యదర్శులు, 5 ఎంపీవోలకు షోకాజ్‌ నోటీసులు జారిచేశారు.


తాజాగా ఇద్దరు కార్యదర్శులు, ఏపీవోపై వేటు

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఆయా గ్రామాలలో పల్లెప్రగతి పనులలో అలసత్వం వహిం చిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చే యడంతో పాటు ఒక ఏపీవఓపై వేటు వేశారు. అదే విధంగా ముగ్గురు సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. భవానిపేట గ్రామంలో రోడ్డుసైడ్‌ అవె న్యూ ప్లాంటేషన్‌లో నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయగా స్థానిక స ర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పాల్వంచ గ్రామంలో కంపోస్ట్‌షెడ్‌ నిర్వహణ విధుల పట్ల అల సత్వం వహించినందుకు స్థానిక సర్పంచ్‌, కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. వాడి గ్రామంలో హరిత హారం మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం చేసిన జీపీ కా ర్యదర్శిని సస్పెండ్‌ చేయగా సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీ సులు ఇచ్చారు. మాచారెడ్డి మండలంలో ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలకు వంద రోజుల పని దినాల కల్పనలో, అవెన్యూ ప్లాంటేషన్‌ పనుల్లో నిర్ల క్ష్యం వహించినందుకు ఏపీవోను కలెక్టర్‌ శరత్‌ సస్పెం డ్‌ చేశారు.


పనుల్లో వేగం పెంచేందుకే

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి పై ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్ర తీ పల్లె అభివృద్ధి పథంలో పరు గులు తీసేలా, ప్రతీ గ్రామం సు ందరంగా మారేలా పనులను చే పట్టాలని ఆదేశాలను జారీ చేశా రు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని ఎట్టి పరి స్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని పలు మార్లు స్పష్టంగా చెప్పారు. ఇరు జిల్లాలో ఏ సమావేశం ఏర్పాటుచేసినా మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు కలెక్టర్‌లు, అదనపు క లెక్టర్‌లు, జిల్లా అధికారులు సైతం పలు సభలు, స మావేశాలు కార్యక్రమాల్లో ఇదే విషయాన్ని చెబుతున్న ప్పటికీ చాలమంది సర్పంచ్‌లు, కార్యదర్శులు నిర్లక్ష్యం గా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది కనీస పట్టింపు లేకుండా వ్యవ హరించినట్లు స మాచారం. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌లు సంబంధిత స ర్పంచ్‌లకు నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. ఇక కింది నుంచి పైదాకా అంతా మనదే అన్న ధీమాతో ఉ న్న అధికార పార్టీ సర్పంచులకూ షోకాజ్‌ నోటీసులు రావడం వారికి మింగుడు పడడం లేదు. 


పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు- డా.శరత్‌, కామారెడ్డి కలెక్టర్‌

ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి, హరితహారం పనుల్లో ఎవరు నిర్లక్ష్యం వహించడానికి లేదు. ప్రతి ఒక్క రూ అభివృద్ధి పనులను అమలుచేయాలి. ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చ ర్యలు తప్పవు. నూతన చట్టానికి అనుగుణంగా సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారు లు పనిచేయాల్సిందే.

Updated Date - 2020-10-02T06:24:36+05:30 IST