BPCL ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కు * బిడ్డర్లు రాకపోవడమే కారణమని వెల్లడి

ABN , First Publish Date - 2022-05-27T02:47:32+05:30 IST

BPCL(భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)ను ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కు మళ్ళింది.

BPCL ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కు  * బిడ్డర్లు రాకపోవడమే కారణమని వెల్లడి

న్యూఢిల్లీ : BPCL(భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)ను ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కు మళ్ళింది. బిడ్డర్లు నిరాసక్తతే ఇదుకు కారణమని ప్రభుత్వం వెల్లడించింది. కేవలం ఒక్క బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. BPCLలో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... 2020 మార్చిలో బిడ్డర్ల నుండి ఆసక్తి వ్యక్తీకరణలను(EoIలు) ఆహ్వానించింది. నవంబరు 2020 నాటికి  మూడు బిడ్‌లు మాత్రం వచ్చాయి. కాగా... ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం తదితర పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంత, కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉండడంతో... ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా... ప్రభుత్వం... BPCL లో తన వాటా అమ్మకం ప్రక్రియను మళ్ళీ కొనసాగిస్తుందా ? లేక... అసలు వాటా అమ్మకం ప్రతిపాదననే వెనక్కు తీసుకుంటుందా ? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ విషయమై స్పందించేందుకు ప్రభుత్వవర్గాలు నిరాకరించాయి.  

Updated Date - 2022-05-27T02:47:32+05:30 IST