Texas లో నికోలస్‌ హరికేన్‌ బీభత్సం!

ABN , First Publish Date - 2021-09-15T19:14:16+05:30 IST

నికోలస్‌ హరికేన్‌ టెక్స్‌సను వణికిస్తోంది. నికోలస్‌ మంగళవారం టెక్సస్‌ తీరాన్ని తాకింది.

Texas లో నికోలస్‌ హరికేన్‌ బీభత్సం!

హ్యూస్టన్‌: నికోలస్‌ హరికేన్‌ టెక్స్‌సను వణికిస్తోంది. నికోలస్‌ మంగళవారం టెక్సస్‌ తీరాన్ని తాకింది. 2017లో హార్వే హరికేన్‌తో దెబ్బతిన్న లూసియానా ప్రాంతంతో సహా గల్ఫ్‌ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 51 సెంటీమీటర్లు వరకు వర్షం పడే ప్రమాదం ఉంది. మియామిలోని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ ప్రకారం సార్జెంట్‌ బీచ్‌కు నైరుతి దిశలో 17 కిలోమీటర్ల దూరంలో మాతగోర్డా ద్వీపకల్పం తూర్పుభాగాన్ని నికోలస్‌ హరికేన్‌ తాకింది. 2021 అట్లాంటిక్‌ హరికేన్‌ సీజన్‌లో ఇది 14వ తుఫాన్‌. ఈ తుఫాన్‌ ఉత్తర ఈశాన్యం వైపు గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఉష్టమండల తుఫాన్‌ నికోలస్‌ మంగళవారం ఆగ్నేయ టెక్సాస్‌ మీదగా, బుధవారం నైరుతి లూసియానా మీదగా నెమ్మదిగా కదులుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-09-15T19:14:16+05:30 IST