ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..

Published: Fri, 21 Jan 2022 18:31:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..

వివాహం జరిగిన తర్వాత వివిధ కారణాలతో దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కట్నం, వివాహేతర సంబంధం, పెళ్లికి ముందున్న ప్రేమ వ్యవహారాలను పెళ్లి తర్వాత కూడా కొనసాగించడం.. తదితర కారణాలతో విభేదాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయాల్లో పెద్దలు కలుగజేసుకుని పంచాయితీలు చేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు భార్యను భర్త, లేక భర్తను భార్యే చంపించడం కూడా జరుగుతుంటుంది. అయితే జార్ఖండ్‌లో మాత్రం సినిమా సీన్‌ను తలదన్నే ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో వెళ్లాలనుకున్న భార్య నిర్ణయాన్ని భర్త స్వాగతించాడు. అయితే చిరవగా ఒక కండీషన్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ జిల్లా కడఘోడ అనే గ్రామానికి చెందిన సంజయ్ మహ, నమిత మహ దంపతులు. వీరికి 2016లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. నమితకు కుటుంబ బాధ్యతల కంటే స్మార్ట్ ఫోన్‌‌లో గడపడం అంటేనే ఎక్కువ ఆసక్తి. రోజులో ఎక్కువ శాతం సోషల్ మీడియాలోనే గడుపుతూ ఉంటుంది. భర్త పలుమార్లు మందలించినా ఆమె తీరు మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో నమితకు ఫేస్‌బుక్‌లో ముంబైకి చెందిన శుక్ర అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఫేస్‌బుక్ చాటింగ్ కాస్త.. కొన్నాళ్లకు వాట్సప్ చాటింగ్ వరకూ వెళ్లింది. అంతటితో ఆగకుండా రోజూ పోన్లు చేసుకుని, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే వరకూ వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు.. భార్య పక్కా స్కెచ్.. ఆ తర్వాతే భర్త ఎంట్రీ.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు..!

ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..

ఓ రోజు ‘‘ చూడాలని వుంది.. అర్జెంట్‌గా మా ఊరికి వచ్చేయ్’’.. అని నమిత బలవంతం చేయడంతో ముంబై నుంచి ప్రియుడు వచ్చేశాడు. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమోగానీ.. ఇద్దరూ కలిసి ఊరు వదిలి వెళ్లిపోయారు. చివరగా పోలీసుల జోక్యంతో నమిత, ఆమె ప్రియుడు మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు, కొందరు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఎంత నచ్చజెప్పాలని చూసినా.. తాను ప్రియుడితో పాటే వెళ్లిపోతానని నమిత చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు నమిత భర్త కూడా అందుకు అంగీకరించాడు. అయితే పిల్లలను కూడా తీసుకెళ్తానంటేనే వెళ్లు అని కండీషన్ పెట్టాడు. అందుకు నమిత, ఆమె ప్రియుడు అంగీకరించడంతో సమస్య సర్దుమణిగింది. అయితే ఈ ఉదంతం మాత్రం స్థానికంగా సంచలనం కలిగించింది.

ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే.. తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు.. డబ్బుల కోసం ఔత్సాహిక దర్శకుడి హైటెక్ ప్లాన్.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బట్టబయలైన అసలు నిజం.. ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.