CM Jagan: రుణ యాప్‌ల వేధింపులు.. భార్యాభర్తల ఆత్మహత్య.. సీఎం జగన్ స్పందన

ABN , First Publish Date - 2022-09-08T18:07:14+05:30 IST

రాజమండ్రి (Rajahmundry): లోన్ యాప్ (Loan app) ఆగడాలు రోజు రోజుకూ పెరగిపోతున్నాయి.

CM Jagan: రుణ యాప్‌ల వేధింపులు.. భార్యాభర్తల ఆత్మహత్య.. సీఎం జగన్ స్పందన

రాజమండ్రి (Rajahmundry): లోన్ యాప్ (Loan app) ఆగడాలు రోజు రోజుకూ పెరగిపోతున్నాయి. వారి వేధింపులు భరించలేక రోజూ ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో రుణ యాప్‌ల వేధింపుల వల్ల భార్యాభర్తలు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న కొల్లి దుర్గారావు, రామలక్ష్మి దంపతుల చిన్నారులు తేజస్వి నాగసాయి (4), లిఖిత శ్రీ (2). ఈ ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు ఆర్థిక సహాయం అంద చేయాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలతని ఆదేశించారు.


పూర్తి వివరాలు.. 

ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులకు ఓ కుటుంబం బలైంది భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  రాజమండ్రిలో సంచలనం రేపింది. అప్పు కట్టాలని లేదంటే న్యూడ్ వీడియోలు (Nude Videos) బయటపెడతామని, ఫేస్ మార్పింగ్ చేశామని లోన్ యాప్ నిర్వహకులు ఆ దంపతులను బెదిరించారు. దాంతో వారు ఈ నెల 6న రాజమండ్రి, శాంతినగర్‌కు చెందిన కొల్లి దుర్గారావు, రామలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.


దుర్గారావు, పెయింటర్‌గా, రామలక్ష్మి టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అల్లూరి జిల్లా, రాజవొమ్మంగి మండలం, లబ్బర్తి గ్రామానికి చెందిన దుర్గారావు దంపతులు జీవనోపాధికోసం పదేళ్ల క్రితం రాజమండ్రికి వలస వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆన్‌లైన్ లోన్ యాప్‌లో అప్పుగా తీసుకున్నారు. కొంత చెల్లించారు. మిగతా డబ్బు  సమయానికి చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గారావు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో తన సోదరుడికి ఆన్ లైన్ లోన్ యాప్ సిబ్బంది వేధింపులవల్ల చనిపోతున్నామని చెప్పాడు.

Updated Date - 2022-09-08T18:07:14+05:30 IST