భార్య హత్య కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T04:49:20+05:30 IST

పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఈనెల 8వ తేదీ శనివారం అర్ధరాత్రి భార్య మంజులను హత్య చేసిన కేసులో భర్త హరీ్‌షను సోమవారం అరెస్టు చేసినట్లు బద్వేలు అర్బన్‌ సీఐ రమే్‌షబాబు తెలిపారు.

భార్య హత్య కేసులో భర్త అరెస్టు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీఐ

బద్వేలు, మే 10: పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఈనెల 8వ తేదీ శనివారం అర్ధరాత్రి భార్య మంజులను హత్య చేసిన కేసులో భర్త హరీ్‌షను సోమవారం అరెస్టు చేసినట్లు బద్వేలు అర్బన్‌ సీఐ రమే్‌షబాబు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. హరీష్‌ తన భార్యపైన అనుమానం పెంచుకోవడంతో పాటు నగలు ఇవ్వలేదన్న కారణంతో కక్ష పెంచుకుని తల్లి చెప్పుడు మాటలు విని భార్య మంజులను హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో హరీష్‌, అతడి తల్లి లక్ష్మిదేవి నిందితులని ఆయన తెలిపారు. హరీ్‌షను సోమవారం పట్టణంలోని శివారులోని నక్కలగండి వద్ద సంచరిస్తుండగా అరెస్టు చేశామన్నారు. లక్ష్మిదేవి పరారీలో ఉందని త్వరలో ఆమెను కూడా అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ సురే్‌షరెడ్డి, పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T04:49:20+05:30 IST