భార్యతో మాట్లాడనివ్వలేదని.. మరదలిని కత్తితో పొడిచిన బావ.. అసలేం జరిగిందంటే..

Published: Thu, 28 Apr 2022 03:54:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భార్యతో మాట్లాడనివ్వలేదని.. మరదలిని కత్తితో పొడిచిన బావ.. అసలేం జరిగిందంటే..

గర్భవతిగా ఉన్న అక్కకు డెలివరీ అయింది. ఆస్పత్రిలో బిల్లు కట్టడానికి డబ్బులు అడిగితే బావ ఇవ్వనన్నాడు. దాంతో ఆ యువతికి కోపం వచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన అక్కతో మాట్లాడేందుకు బావ ఫోన్ చేస్తే కట్ చేసేసింది. అతని నెంబరును బ్లాక్ చేసింది. వేరే నెంబరుతో ఫోన్ చేసినా అక్కకు ఇవ్వలేదు. దీంతో బావకు చాలా కోపం వచ్చింది. తర్వాత బిడ్డను చూసేందుకు ఇంటికి వచ్చినప్పుడు కూడా అతనితో అత్తమామలు, మరదలు చాలా పరుషంగా మాట్లాడారు. ఆస్పత్రి బిల్లు కట్టేందుకు డబ్బులు ఇవ్వలేదని దుర్భాషలాడారు. దీంతో కోపంతో ఊగిపోయిన అతను.. జేబులో నుంచి కత్తి తీసి మరదలిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన బిహార్ రాజధాని పట్నా సమీపంలో వెలుగు చూసింది. 


పట్నా సమీపంలో దానాపూర్ ప్రాంతానికి చెందిన సోనూ కుమార్ అనే వ్యక్తికి లక్ష్మీ అనే యువతితో కొంతకాలం క్రితం పెళ్లి అయింది. ఆమె చెల్లి ఉమ (21). లక్ష్మి గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. డెలివరీ సమయంలో డబ్బుల కోసం సోనూకు ఫోన్ చేస్తే చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో ఉమకు కోపం వచ్చింది. బావ ఫోన్ చేస్తే అక్కను మాట్లాడనివ్వలేదు. అతని నెంబర్ బ్లాక్ చేసేసింది. వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేసినా అక్కను మాట్లాడనివ్వలేదు. ఈ కోపంతోనే ఇంటికి వచ్చి ఆ కుటుంబంతో గొడవకు దిగాడు సోనూ. 


ఈ క్రమంలో అత్తమామలు కూడా వెనక్కు తగ్గకపోవడంతో ఆగ్రహంతో ఉమపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న  పోలీసులు.. సోనూపై కేసు నమోదు చేశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.