Viral News: రోజూ భార్య చితక్కొడుతోందని చెట్టెక్కిన భర్త.. నెల రోజులుగా అక్కడే మకాం.. ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు..

ABN , First Publish Date - 2022-08-27T16:39:57+05:30 IST

భర్త పెడుతున్న బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిందనే వార్తలు ఇప్పటి వరకు చాలానే చూసుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్ అందుకు పూర్తిగా భిన్నం. భార్య చేతిలో తన్నులు పడలేక ఓ భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. చెట్టెక్కి

Viral News: రోజూ భార్య చితక్కొడుతోందని చెట్టెక్కిన భర్త.. నెల రోజులుగా అక్కడే మకాం.. ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు..

ఇంటర్నెట్ డెస్క్: భర్త పెడుతున్న బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిందనే వార్తలు ఇప్పటి వరకు చాలానే చూసుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్ అందుకు పూర్తిగా భిన్నం. భార్య చేతిలో తన్నులు పడలేక ఓ భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. చెట్టెక్కి నెలరోజులుగా దానిపైనే మకాం వేశాడు. కిందకు దిగే ప్రసక్తే లేదంటూ వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చుట్టు పక్కల జిల్లాల్లో కూడా ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



రామ్‌ప్రవేశ్(Rampravesh) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితమే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో భార్యభర్తలు ఇద్దరూ అనోన్యంగా ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రామ్‌పై అతడి భార్య చేయి చేసుకుంది. అప్పటి నుంచి ఆ అతడి జీవితంలో ప్రతి రోజూ రిపీట్ అయింది. వృద్ధాప్య దశలోనూ భార్య రోజూ చితక్కొట్టడాన్ని తట్టుకోలేక అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. భార్య చేతిలో దెబ్బలు తప్పించుకోవడానికి ఇంటి ముందు ఉన్న సుమారు 100 అడుగుల చెట్టెక్కేశాడు. నెల రోజులుగా దానిపైనే నివాసం ఉంటున్నాడు. రాత్రి సమయంలో కిందకు దిగుతున్న అతడు.. కొన్ని రాళ్లను సేకరించుకుని తిరిగి చెట్టెక్కేస్తున్నాడు. ఎవరైనా అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేయబోతే.. రాళ్లతో వారిపై దాడికి దిగుతున్నాడు. రామ్ చెట్టెక్కి అక్కడే నివాసం ఉండటం పట్ల గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘చెట్టు ఊరి నడిబొడ్డున ఉన్నందున.. అతడికి గ్రామంలోని ప్రతి ఇల్లు కనబడుతుంది. దీంతో మా ప్రైవసీకి భంగం కలుగుతుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తాడు సహాయంతో అతడికి అన్నం, నీళ్లు అందిస్తున్నారు. ఇంతకూ ఈ ఘటన ఎక్కడే జరిగిందో చెప్పలేదు కదూ. ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని మౌ (Mau) జిల్లాలో చోటు చేసుకుంది. 


Updated Date - 2022-08-27T16:39:57+05:30 IST