ఇంట్లోంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ తండ్రి నిర్వాకాన్ని స్థానికులకు చెప్పిన 13 ఏళ్ల బాలిక.. కంగారుగా అంతా వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-07-02T18:51:14+05:30 IST

13ఏళ్ల బాలిక భయంతో ఇంట్లోంచి పరుగెత్తుకురావడం చూసి స్థానికులు కంగారుపడ్డారు. ‘ఏం జరిగింది’ అని ఆ బాలికను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చెప్పింది విని స్థానికులంతా షాకయ్యారు. వెంటనే ఆ చిన్నారి ఇం

ఇంట్లోంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ తండ్రి నిర్వాకాన్ని స్థానికులకు చెప్పిన 13 ఏళ్ల బాలిక.. కంగారుగా అంతా వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: 13ఏళ్ల బాలిక భయంతో ఇంట్లోంచి పరుగెత్తుకురావడం చూసి స్థానికులు కంగారుపడ్డారు. ‘ఏం జరిగింది’ అని ఆ బాలికను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చెప్పింది విని స్థానికులంతా షాకయ్యారు. వెంటనే ఆ చిన్నారి ఇంటికి పరుగులు తీశారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి నివ్వెరబోయారు. కాగా.. ప్రస్తుతం స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గడ్‌‌లోని కంకర్ జిల్లాకు చెందిన జీవానంద్‌కు ప్రస్తుతం 45ఏళ్లు. పెళ్లైన కొన్నాళ్లకే భార్య చనిపోవడంతో అతడు.. భర్తను కోల్పోయి అప్పటికే 3ఏళ్ల కూతురు ఉన్న లతిక(35) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. 10ఏళ్ల క్రితం వీరిద్దరికీ పెళ్లైనా సంతానం కలగలేదు. దీంతో లతిక కూతురును అతడు సొంత కూతురుగా భావించాడు. కుటుంబ పోషణకు అతడు కూలీ పనులు చేస్తుండగా.. ఆమె మాత్రం ఓ పార్లర్‌లో పని చేస్తోంది. అయితే కొద్ది రోజలుగా ఉదయాన్నే పని కోసం పార్లర్‌కు వెళ్తున్న లతిక.. సాయంత్రం ఆలస్యంగా ఇంటికి తిరిగొస్తుంది. దీంతో అతడు భార్యను అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆమె అక్కడ పని మానేసి కూలీ పనులకే వెళ్తోంది. అయినప్పటికీ అతడు తన భార్యను అనుమానించడం మానలేదు. తాజాగా ఇదే విషయంపై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 



13ఏళ్ల కూతురి కళ్ల ఎదుటే.. లతికపై అతడు చేయి చేసుకున్నాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమెపై అతడు దాడికి పాల్పడ్డాడు. అది చూసి లతిక కూతురు భయాందోళనకు గురైంది. ఇంట్లోంచి పరుగులు తీసింది. జరిగిన విషయం స్థానికులకు చెప్పి, వారితో సహా ఇంటికి చేరుకునే సరికే ఘోరం జరిగిపోయింది. కత్తితో అతడు లతిక పీక కోశాడు. విషయం తెలిసి పెద్ద ఎత్తున అక్కడ జనం గుమికూడటంతో అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. కాగా.. విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా జీవానంద్‌పై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2022-07-02T18:51:14+05:30 IST