
ఇంటర్నెట్ డెస్క్: అతడు తన భార్యను ప్రేమగా బయటకు తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా జ్యూస్లో విషం కలిపిచ్చాడు. అనంతరం ఆమెను ఐదురోజులపాటు రూమ్లో బంధించాడు. చావడం గ్యారెంటీ అనే నమ్మకం కుదిరాకా.. ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స పొందిన ఆమె.. మృతి చెందింది. ఇంతకూ అతడు అలా ఎందుకు ప్రవర్తించాడనే పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన వ్యక్తికి ఓ మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో వారి సంసారం బాగానే సాగింది. అయితే తన భార్య గురించి తాజాగా అతడికి సంచలన విషయం తెలిసింది. తన సోదరుడితో ఆమెను అసభ్యకర రీతిలో చూసి.. అతడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను తిట్టికొట్టి.. అతని సోదరుడిపై బలవంతంగా అత్యాచారం కేసు పెట్టించాడు. అయినా అతడికి తన భార్యపై ఉన్న కోపం తగ్గలేదు. దీంతో ఆమెకు అనుమానం రాకుండా ప్రేమగా ఉంటూ బయటకు తీసుకెళ్లాడు. చెరకు రసంలో విషం కలిపి ఆమెతో తాగించాడు. అనంతరం ఆమెను ఐదురోజులపాటు గదిలో బంధించాడు. ఆమె పరిస్థితి విషమించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మే 20న మృతి చెందింది.
అయితే అత్యాచారం ఘటనను తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి వైఖరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం, భార్య తరఫు కుటుంబ సభ్యులు కూడా అతడిని అనుమానించడంతో అధికారులు మరింత లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం బయటపడింది. భార్య వివాహేత సంబంధం గురించి తెలిసి.. అతడే ఆమెకు విషం ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి తండ్రి పాత్ర కూడా ఉందని గుర్తించిన అధికారులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి