
ఇంటర్నెట్ డెస్క్: ఆ అన్నాచెల్లెలు ఇద్దరూ స్నేహితులతో సరదాగా ఆడుకోవడానికి బయటికెళ్లారు. సాయంత్రం వరకూ ఉల్లాసంగా గడిపి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో కనిపించిన దృష్యాలు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. తల్లిదండ్రులు ఇద్దరూ విగత జీవులుగా కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు కొన్నేళ్ల క్రితమే ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో రంజిత్ దంపతులు సౌరబ్(14), నిధి(10) అనే పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా సౌరబ్, నిధి ఇద్దరూ తమ స్నేహితులతో ఆడుకోవడానికి ఇంట్లోంచి బయటికెళ్లారు. సాయంత్రం వరకూ ఆనందంగా గడిపి.. 4 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో కనిపించిన దృశ్యాలను చూసి ఈ ఇద్దరు పిల్లలు షాకయ్యారు. తండ్రి హాల్లో ఉరితాడుకు వేలాడుతూ ఉండటాన్ని చూసి విస్తుపోయారు. తల్లిని వెతుక్కుంటూ గదిలోకి పరుగులు తీశారు. అక్కడ తమ తల్లి విగత జీవిగా పడి ఉంటడాన్ని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ క్రమంలో పోలీసుకుల విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఓ సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధికారులు.. సూసైడ్ నోట్లోని సమాచారాన్ని వెల్లడించారు. తన భార్య వైఖరితో విసుగు చెందే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రంజిత్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని తెలిపారు. ఈ క్రమంలో భార్యను హత్య చేసిన అనంతరం రంజిత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. నిజానిజాల కోసం మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు వివరించారు.
ఇవి కూడా చదవండి