పెళ్లైన 18 రోజులకు అల్లుడి నుంచి ఫోన్.. కూతురి గురించి అతడు చెప్పిన మాటలు విని తండ్రి ఆందోళన.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో..

ABN , First Publish Date - 2022-06-25T18:02:14+05:30 IST

కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టానని ఆ తండ్రి అప్పుడప్పుడే రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో ఓ రోజు అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. అతడు చెపిన మాటలు విని ఆ తండ్రి అల్లాడిపోయాడు. వెంటనే తన గారాలపట్టిని చూసేందుకు భార్యతో స

పెళ్లైన 18 రోజులకు అల్లుడి నుంచి ఫోన్.. కూతురి గురించి అతడు చెప్పిన మాటలు విని తండ్రి ఆందోళన.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో..

ఇంటర్నెట్ డెస్క్: కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టానని ఆ తండ్రి అప్పుడప్పుడే రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో ఓ రోజు అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. అతడు చెపిన మాటలు విని ఆ తండ్రి అల్లాడిపోయాడు. వెంటనే తన గారాలపట్టిని చూసేందుకు భార్యతో సహా బయల్దేరాడు. అనంతరం అల్లుడి ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కాగా.. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన సునీల్ పండిట్ అనే వ్యక్తి తన కూతురు సుష్మా కుమారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన  రామ్ బరన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. సంప్రదాయం ప్రకారం కూతురి వివాహం జరిపించిన సునీల్ పండిట్.. కూతురుని ఓ అయ్య చేతిలో పెట్టాననే సంతోషంతో అప్పుడప్పుడే రిలాక్స్ అవుతున్నాడు. సరిగ్గా పెళ్లైన 18 రోజులకు అల్లుడి నుంచి అతడికి ఫోన్ వచ్చింది. సుష్మా.. కడుపు నొప్పితో బాధపడుతుందని అల్లుడు చెప్పడంతో సునీల్ పండిట్ కంగారు పడ్డాడు. వెంటనే తన భార్యతో సహా కుతురు దగ్గరకు బయల్దేరాడు. ఈ క్రమంలో అల్లుడి ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి అతడు షాకయ్యాడు. కూతురి విగత జీవిగా పడి ఉండటం.. అల్లుడు సహా అతడి కుటుంబ సభ్యులు ఇంట్లో కనిపించకపోవడంతో సునీల్ పండిట్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. సుష్మాను ఊరిరాడకుండా చేసి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సునీల్ పండిట్.. తన అల్లుడు రామ్ బరన్ కుమార్ సహా అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.40వేల అదనపు కట్నం కోసమే.. తన కూతురిని హత్య చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు.. పరారీలో ఉన్న నిందుతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 


Updated Date - 2022-06-25T18:02:14+05:30 IST