భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. అనుమానం వచ్చి భార్య మొబైల్ ట్రేస్ చేస్తే..

ABN , First Publish Date - 2022-05-03T17:41:54+05:30 IST

వారిద్దరికీ ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.. అదనపు కట్నంతోపాటు బైక్ కూడా తీసుకురావాలని భార్యను భర్త వేధించేవాడు..

భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. అనుమానం వచ్చి భార్య మొబైల్ ట్రేస్ చేస్తే..

వారిద్దరికీ ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.. అదనపు కట్నంతోపాటు బైక్ కూడా తీసుకురావాలని భార్యను భర్త వేధించేవాడు.. కట్నం విషయమై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.. ఈ క్రమంలో ఈ నెల 19న భార్య అదృశ్యమైంది.. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అల్లుడిపై హత్య కేసు పెట్టారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారు.. కేసు దర్యాఫ్తు చేస్తున్న అధికారికి అనుమానం వచ్చి ఆ మహిళ మొబైల్ ట్రేస్ చేస్తే అసలు విషయం బయటపడింది. 


బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరికి చెందిన శాంతి దేవికి, దినేష్ రామ్‌ అనే వ్యక్తితో 2016లో పెళ్లి జరిగింది. ఈ నెల 19న శాంతిదేవి హఠాత్తుగా అదృశ్యమైంది. తమ కుమార్తె కనిపించకపోవడంతో శాంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లుడు అదనపు కట్నం కోసం తమ కూతురిని వేధిస్తున్నాడని, అతడే తమ కూతురిని చంపేసి మృతదేహాన్ని మాయం చేసి ఉంటాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్ రామ్‌‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీస్ అధికారికి శాంతి గురించి అనుమానం మొదలైంది. దీంతో శాంతి దేవి మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి వెతగ్గా.. అక్కడ తన ప్రియుడితో కలిసి శాంతి దేవి కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు మోతిహరికి తీసుకెళ్లారు. 

Read more