
జయశంకర్ : జిల్లాలోని భూపాలపల్లి రాంనగర్లో దారుణం చోటుచేసుకుంది. పీకల్లోతు మద్యం (Drunk) మత్తులో భార్యపై భర్త రమేష్ దాడి చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న భార్య రాజ్యలక్ష్మిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికే రమేష్ పరారయ్యాడు. కాగా.. రమేష్‌కు రాజ్యలక్ష్మి రమేష్‌కు రెండో భార్య. అయితే నిత్యం మద్యం సేవించి రాజ్యలక్ష్మిని రమేష్ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.