ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ భర్తకు దొరికిపోయిన భార్య.. ఆ తర్వాత ఎంత ఘోరం జరిగిందంటే..

Published: Tue, 29 Mar 2022 14:45:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ భర్తకు దొరికిపోయిన భార్య.. ఆ తర్వాత ఎంత ఘోరం జరిగిందంటే..

ఒక ప్రేమ వ్యవహారం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది.. ఇద్దరి మరణాలకు కారణమైంది. ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది.. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్యను భర్త చంపేశాడు. అనంతరం ఆమె ప్రియుడిని కూడా చంపేశాడు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


బుర్హాన్‌పూర్‌కు సమీపంలోని ధుల్‌కోట్‌కు చెందిన జేత్ రామ్ అనే వ్యక్తి తన భార్య భారతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆమె తన ఎదురింట్లో ఉండే మున్సీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా రహస్యంగా అతడిని కలిసేది. అయితే ఇటీవల వీరిద్దరి వ్యవహారంపై జేత్‌రామ్‌కు అనుమానం మొదలైంది. భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాట వినలేదు. ప్రియుడిని రహస్యంగా కలుస్తూ ఉండేది. 


గత ఆదివారం భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోంది. అదే సమయంలో భర్త రావడంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఎవరితో మాట్లాడుతుందో చెక్ చేసిన జేత్‌రామ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమె ప్రియుడిని కూడా ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. ఇద్దరూ తీవ్ర గాయాల పాలుకావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జేత్‌రామ్‌ను అరెస్ట్ చేశారు.     

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.