14 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు ఉన్నా ఆ భర్తకు ఇదేం పాడు బుద్ధి.. ఆ భార్యకు మరో దారి లేక..

ABN , First Publish Date - 2022-04-28T18:18:52+05:30 IST

ఆ మహిళకు 14 ఏళ్ల క్రితం పెళ్లైంది.. ఒక కొడుకు, కూతురు ఉన్నారు.. పెళ్లి జరిగి 14 సంవత్సరాలు అవుతున్నా ఆ మహిళ వరకట్న వేధింపులు ఎదుర్కొంటూనే ఉంది..

14 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు ఉన్నా ఆ భర్తకు ఇదేం పాడు బుద్ధి.. ఆ భార్యకు మరో దారి లేక..

ఆ మహిళకు 14 ఏళ్ల క్రితం పెళ్లైంది.. ఒక కొడుకు, కూతురు ఉన్నారు.. పెళ్లి జరిగి 14 సంవత్సరాలు అవుతున్నా ఆ మహిళ వరకట్న వేధింపులు ఎదుర్కొంటూనే ఉంది.. రూ.50 వేలు తీసుకు రావాలని, లేకపోతే ఇంట్లో ఉండడానికి వీల్లేదని అత్త ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసింది.. కొడుకు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునేలా ప్రోత్సహించింది.. దీంతో బాధిత మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు.. అనారోగ్యంతో ఉన్న తల్లి తప్ప వేరే అండ లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


హర్యానాలోని పానిపట్‌కు సమీపంలోని కకోడా ఇస్రానా గ్రామానికి చెందిన బాధిత మహిళకు 14 ఏళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు 11 ఏళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు ఉన్నారు. పెళ్లి జరిగి 14 ఏళ్లు కావొస్తున్నా రాజు తల్లి కోడలిని కట్నం కోసం వేధిస్తూనే ఉంది. రూ.50 వేలు తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. బాధిత మహిళ ఎంతకీ కట్నం డబ్బులు తీసుకురాకపోవడంతో ఏడాది క్రితం ఆమెను ఇంటి నుంచి గెంటేసింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత రాజు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఇంట్లోనే జీవనం సాగిస్తున్నాడు. 


బాధిత మహిళ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది. ఏడాదిగా కొడుకు, కూతురుతో కలిసి తల్లితోనే ఉంటున్న మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. భర్త చేసిన నిర్వాకం గురించి పోలీసులకు పిర్యాదు చేసింది. భర్త పూర్తిగా పట్టించుకోకపోవడంతో తమకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  


 

Updated Date - 2022-04-28T18:18:52+05:30 IST