బాబోయ్.. ఈ టార్చర్ భరించలేనంటూ భార్యపై కేసు పెట్టిన భర్త.. 16 నెలల క్రితం కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నా..

ABN , First Publish Date - 2021-10-27T00:22:13+05:30 IST

అవయవలోపం ఉన్నా కూడా ఇంజినీర్‌గా ఉన్నతస్థాయిలోనే ఉన్నాడు. డబ్బుకు ఎటువంటి లోటూ లేదు..ఇక జీవితంలో ఓ తోడు ఉంటే చాలనుకున్నాడు. కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన జీవితంలో సంతోషం నింపుతుందనుకున్నాడు. కానీ..ఆమె ఇంట్లో కాలుపెట్టాక అతడి జీవితం ఒక్కసారిగా తల్లకిందులైపోయింది.. నిత్యనరకంగా మారిపోయింది.

బాబోయ్.. ఈ టార్చర్ భరించలేనంటూ భార్యపై కేసు పెట్టిన భర్త.. 16 నెలల క్రితం కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నా..

ఇంటర్నెట్ డెస్క్: అతడిది ప్రశాంతమైన జీవితం! అవయవలోపం ఉన్నా కూడా ఇంజినీర్‌గా ఉన్నతస్థాయిలోనే ఉన్నాడు. డబ్బుకు ఎటువంటి లోటూ లేదు..ఇక జీవితంలో ఓ తోడు ఉంటే చాలనుకున్నాడు. కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన జీవితంలో సంతోషం నింపుతుందనుకున్నాడు. కానీ..ఆమె ఇంట్లో కాలుపెట్టాక అతడి జీవితం ఒక్కసారిగా తల్లకిందులైపోయింది.. నిత్యనరకంగా మారిపోయింది. ఈ టార్చర్ భరించలేనంటూ అతడు చివరికి భార్యపై కేసు పెట్టాడు. ఉత్తరప్రదేశ్ అలీఘడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. 


అలీగఢ్‌లోని కాసిమ్‌పూర్ కాలనీకి చెందిన ఓ దివ్యాంగుడికి 2020 జూన్ 30 స్వప్న అనే యువతితో వివాహం జరిగింది. స్వప్నది ఆగ్రా. అయితే.. పెళ్లైన తరువాత కొంత కాలం పాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తరువాతే బాధితుడి జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. ప్రతి చిన్న విషయానికీ తనతో గొడవపడుతూ నిత్యం వేధించేదని అతడు పోలీసుల వద్ద వాపోయాడు. తననే కాకుండా తన తల్లిదండ్రులనూ నిత్యం తూలనాడేదని చెప్పుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా విచక్షణ కోల్పోయి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేదన్నాడు. అయితే.. ఈ కలహాల కాపురంలోనే వారికి ఓ బిడ్డకూడా కలిగింది. 


బిడ్డ పుట్టిన తరువాతైనా ఆమెలో మార్పు వస్తుందని అతడు ఆశిస్తే అది అడియాశగానే మిగిలిపోయింది. గొడవలు సద్దుమణగక పోగా మరింతగా ముదిరాయి. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమె అతడితో పెద్ద లడాయి వేసుకునేది. ఇటీవల ఓ రోజు ఆమె ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని బిడ్డతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమెను ఇంటికి రమ్మని భర్త ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో అతడు తన కుటుంబసభ్యులను తీసుకుని అత్తింటికి వెళ్లాడు. ఆమెను ఇంటికి రమ్మని బతిమాలాడాడు. కానీ..ఆమె మాత్రం మరింత రెచ్చిపోయి భర్తను అతడి కుటుంబసభ్యులను ఘోరంగా అవమానించి బయటకు గెంటేసింది. ఆ తరువాత కొద్ది రోజులకు తన తండ్రితో పాటు మరికొందరిని వెంటేసుకుని భర్త వద్దకు వచ్చిన ఆమె అతడిని బాగా చితకబాదింది. ఈ వేధింపులు తట్టుకోలేని అతడు చివరకు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్య స్వప్న, ఆమె తండ్రి శిశుపాల్, మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడుతుండంటూ బాధితుడికి భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-10-27T00:22:13+05:30 IST