విడాకులిచ్చినా వదలని భర్త.. విసిగిపోయి ఎస్పీకి భార్య ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-12T23:25:17+05:30 IST

విడాకులిచ్చినా వదలని భర్త.. విసిగిపోయి ఎస్పీకి భార్య ఫిర్యాదు

విడాకులిచ్చినా వదలని భర్త.. విసిగిపోయి ఎస్పీకి భార్య ఫిర్యాదు

గుంటూరు: భార్య నుంచి విడాకులు తీసుకుని ఆమెపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు ఓ దుర్మార్గుడు. దాంతో విసిగిపోయిన బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరుకు చెందిన సలీనా, షబ్బీర్‌కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మూడు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత సలీనా ఫొటోలు అసభ్యంగా తయారు చేసి ఫేస్ బుక్‌లో పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపై సలీనా పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు స్పందించలేదు. దీంతో స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్బన్ ఎస్పీకి షబ్బీర్‌పై సలీనా ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 

 


Updated Date - 2021-04-12T23:25:17+05:30 IST