Karachi suicide bomber భర్త సంచలన ట్వీట్
ABN , First Publish Date - 2022-04-27T17:35:45+05:30 IST
కరాచీ ఆత్మాహుతి బాంబర్ భర్త తాజాగా సంచలన ట్వీట్ చేశారు....
కరాచీ (పాకిస్థాన్) : కరాచీ ఆత్మాహుతి బాంబర్ భర్త తాజాగా సంచలన ట్వీట్ చేశారు.కరాచీ యూనివర్శిటీలో ముగ్గురు చైనీస్ పౌరులను చంపిన ఆత్మాహుతి బాంబర్ అయిన 30 ఏళ్ల షరీ బలోచ్ భర్త ట్వీట్ చేశారు. తన భార్య నిస్వార్థ చర్య పట్ల గర్వం వ్యక్తం చేస్తూ భర్త ట్వీట్ చేశారు. ‘‘షరీ జాన్... నీ నిస్వార్థ చర్యతో నేను కూడా ఈ రోజు గర్వపడుతున్నాను. మహరోచ్,మీర్ హసన్ తమ తల్లి ఎంత గొప్ప మహిళ అని ఆలోచిస్తూ గర్వించదగిన వ్యక్తులుగా ఎదుగుతారు.’’ అంటూ కరాచీ ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి భర్త అయిన హబిటన్ బషీర్ బలోచ్ ట్వీట్ చేశారు.బలూచ్ లిబరేషన్ ఆర్మీ మొదటి మహిళా ఫిదాయీగా దాడి చేసింది. ‘‘షరీ బలోచ్ అలియాస్ బ్రంష్ నాజర్ అబాద్ టర్బత్ నివాసి. 30 ఏళ్ల షరీ జువాలజీలో మాస్టర్స్‌తో ఉన్నత విద్యను అభ్యసించారు, ఎంఫిల్ చదువుతున్నారు.
ఆమె సెకండరీ స్కూల్లో సైన్స్ టీచర్‌గా కూడా పని చేస్తున్నారు.’’ అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ కు భర్త, ఇద్దరు పిల్లలు. ఎనిమిదేళ్ల మహర్రోష్, నాలుగేళ్ల మీర్ హసన్. ఆమె భర్త డెంటిస్ట్, ఆమె తండ్రి ప్రభుత్వోద్యోగి అని లిబరేషన్ ఆర్మీ తెలిపింది.