కాల్చి పడేసిన సిగరెట్ ముక్కలు చూసి డౌట్.. భార్యకు తెలీకుండా ఇంట్లో సీసీ కెమెరాలు.. రికార్డైన వీడియోలను చూసిన ఆ భర్తకు..

ABN , First Publish Date - 2021-11-24T23:48:04+05:30 IST

బెంగళూరులో ఓ వ్యక్తి సీసీ కెమెరాల సాయంతో భార్యకు సంబంధించిన సీక్రెట్ విషయాలను తెలుసుకున్నాడు. సిగరెట్ ముక్కలు ఇంట్లో పడి ఉండడంతో అనుమానం వచ్చి..

కాల్చి పడేసిన సిగరెట్ ముక్కలు చూసి డౌట్.. భార్యకు తెలీకుండా ఇంట్లో సీసీ కెమెరాలు.. రికార్డైన వీడియోలను చూసిన ఆ భర్తకు..
ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఎలాంటి నేరాలయినా.. ఏదో ఒక సందర్భంలో బయటపడుతున్నాయి. వంద మంది పోలీసులు చేయలేని పని.. ఒక్క సీసీ కెమెరా చేస్తుందనేది వాస్తవం. ప్రస్తుతం సీసీ కెమెరాల సాయంతో చాలా క్లిష్టమైన కేసులను సులభంగా ఛేదించగలుగుతున్నారు. పోలీసుల విషయం అటుంచితే.. బెంగళూరులో ఓ వ్యక్తి సీసీ కెమెరాల సాయంతో భార్యకు సంబంధించిన సీక్రెట్ విషయాలను తెలుసుకున్నాడు. సిగరెట్ ముక్కలు ఇంట్లో పడి ఉండడంతో అనుమానం వచ్చి కెమెరాలు పెట్టాడు. చివరకు అందులో రికార్డయిన వీడియోలను చూసి షాక్ అయ్యాడు..


బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ యువకుడు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. అసలే సాఫ్ట్‌వేర్ కావడంతో బాగా సంపాదించాడు. దీంతో ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేకుండా హాయిగా సంసారం సాగించేవారు. అంత మంచి భర్త దొరికినందుకు సంతోషంగా ఉండాల్సిన భార్య.. స్థానికుంగా ఉండే కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీసుకు పోగానే.. ఇంట్లో రాసలీలలు సాగించేది. అక్రమ సంబంధాలు ఎన్నో రోజులు దాగవన్నది తెలిసిందే. ఇక్కడ వీరి అక్రమ సంబంధాన్ని సిగరెట్ పీకలు బయటపెట్టాయి.


ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు.. లోపల పడక గదిలో సిగరెట్ పీకలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. భార్యను అడిగితే.. తెలీనట్లు నటించింది. తన ప్రమేయం లేకుండా ఇంట్లోకి ఎవరొచ్చారూ.. అని ఆలోచించాడు. ఎలాగైనా కనిపెట్టాలనే ఉద్దేశంతో భార్య సెల్‌కు తన ల్యాప్‌టాప్‌కు కనెక్షన్ చేశాడు. అలాగే భార్యకు తెలీకుండా.. ఇంట్లో చాలా గదుల్లో సీసీ కెమెరాలు అమర్చాడు. కొన్నాళ్లు తనకు ఎలాంటి అనుమానమూ లేనట్లు నటించేవాడు. దీంతో భార్య మళ్లీ గుట్టుగా కథ నడిపించేది.


ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడితో భార్య మాట్లాడిన మాటలన్నీ.. తన సెల్‌లో విన్నాడు. ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజీని బయటికి తీసి చూస్తే.. భార్య బాగోతం మొత్తం బయటపడింది. ఇలాంటి భార్య నాకు వద్దంటూ కోర్టుకు వెళ్లాడు. వీడియోలన్నింటినీ పరిశీలించిన కోర్టు.. అతడికి విడాకులు మంజూరు చేసింది. కుమార్తె సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు కూడా తండ్రికే అప్ప‌గించింది. అక్రమ సంబంధం కారణంగా చివరకు ఆమె జీవితం అధోగతి పాలైంది.

Updated Date - 2021-11-24T23:48:04+05:30 IST