భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఆ భర్త ఎంత దారుణం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-15T05:38:26+05:30 IST

భర్త ఇంట్లో లేని సమయంలో అత్తారింట్లో గొడవ పడి ఒక యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయిన విషయం భర్తకు తెలియదు. ఇంటికి వచ్చిన భర్త విషయం తెలుసుకొని ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లాడు...

భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఆ భర్త ఎంత దారుణం చేశాడంటే..

భర్త ఇంట్లో లేని సమయంలో అత్తారింట్లో గొడవ పడి ఒక యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయిన విషయం భర్తకు తెలియదు. ఇంటికి వచ్చిన భర్త విషయం తెలుసుకొని ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లాడు. కానీ అక్కడ తన భార్య తల్లిదండ్రలతో గొడవపడి హత్యలు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజం గఢ్ నగరానికి చెందిన రమేష్ కుమార్(28) అనే యువకుడికి అదే నగరంలో నివసించే సుష్మ(26, పేరు మార్చబడినది)తో గత సంవత్సరం వివాహం జరిగింది. కానీ పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. పైగా రమేష్ కుమార్ తల్లిదండ్రులు కూడా కోడలిని చిత్రహింసలు పెట్టేవారు. ఈ క్రమంలో ఇటీవల ఒకరోజు సుష్మ తన భర్త ఇంట్లోలేని సమయంలో అత్తమామలతో గొడవపడి తన పుట్టింటికి వెళ్లిపోయింది.


సుష్మ ఇల్లు వదిలి వెళ్లిపోయిన తరువాత రమేష్ కుమార్ ఇంటికొచ్చాడు. జరిగిన విషయం తెలుసుకొని కోపంతో తన భార్యను తీసుకురావడానికి వెళ్లాడు. ఆ తరువాత రమేష్ కుమార్ తన అత్తారింటికి వెళ్లేసరికి ముందుగా సుష్మ తల్లి అతడిని అల్లుడని కూడా చూడకుండా.. బయటికి వెళ్లమని చెప్పింది. కానీ రమేష్ కుమార్ ఆమెను పట్టించుకోలేదు.. తన భార్యను వెంటతీసుకువెళ్లేందుకు వచ్చానని చెప్పాడు. ఇక అత్తా అల్లుళ్ల మధ్య గొడవ ముదిరి రమేష్ కుమార్ తన వద్ద తుపాకీతో అత్త అని కూడా చూడకుండా ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో సుష్మ తల్లి అక్కడికక్కడే చనిపోయింది. తుపాకీ పేలిన శబ్దం విని సుష్మ తండ్రి లోపలి నుంచి వచ్చాడు. 


రమేష్ కుమార్ తన మామను సుష్మ గురించి అడిగాడు. కానీ అక్కడ సుష్మ తల్లి శవం చూసి.. ఆయన కూడా అల్లడిపై కోపంగా అరిచాడు. దీంతో రమేష్ కుమార్ తన మామను కూడా తుపాకీతో కాల్చాడు. ఆ తరువాత ఇంట్లో సుష్మ కోసం ఎంత వెతికినా కనబడపోయేసరికి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో తుపాకీ పేలిన శబ్దం విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. రమేష్ కుమార్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం వారు చూశారు.


హత్యల గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రమేష్ కుమార్ మామ(సుష్మ తండ్రి) కొన ఊపిరితో ఉండగా.. ఆయనను ఆస్పత్రికి చేర్చారు. కానీ ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు రెండు హత్యల కేసు విచారణ చేస్తుండగా.. రమేష్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2022-02-15T05:38:26+05:30 IST