ఛీ.. ఛీ.. వీడసలు భర్తేనా..? పనుందని చెప్పి ఫ్రెండ్‌ బైక్‌పై భార్యను వెళ్లమన్నాడు.. ఘోరం జరిగాక అసలు నిజం ఆమెకు తెలిసి..

ABN , First Publish Date - 2021-10-06T21:17:07+05:30 IST

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె సరదాగా బయటికి తీసుకెళ్లమని భర్తని అడిగింది. అపుడు అతడు ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి తిన్నాక.. తనకు కొంచెం పనుందని, తర్వాత వస్తానని చెప్పి ఆమెను ఫ్రెండ్ బైక్‌పై వెళ్లమన్నాడు

ఛీ.. ఛీ.. వీడసలు భర్తేనా..? పనుందని చెప్పి ఫ్రెండ్‌ బైక్‌పై భార్యను వెళ్లమన్నాడు.. ఘోరం జరిగాక అసలు నిజం ఆమెకు తెలిసి..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె సరదాగా బయటికి తీసుకెళ్లమని భర్తని అడిగింది. అపుడు అతడు ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి తిన్నాక.. తనకు కొంచెం పనుందని, తర్వాత వస్తానని చెప్పి ఆమెను ఫ్రెండ్ బైక్‌పై వెళ్లమన్నాడు. అతడు చెప్పిన మాటలు నిజంగానే నమ్మి ఆమె అతడితో పాటు వెళ్లింది. ఆ తర్వాత ఘోరం జరిగిపోయింది. అపుడు ఆమెకు అసలు నిజం తెలిసి కంగుతింది. అందరూ సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.


21 ఏళ్ల వయసున్న ఓ యువతి రింగాస్ ప్రాంతంలోని మౌ గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగు రోజుల క్రితం రాత్రి 9 గంటలకు ఆమె భర్తతో కలిసి హోటల్‌కు వెళ్లింది. అపుడు అక్కడికి ఆమె భర్త ఫ్రెండ్ సోను శర్మ అనే వ్యక్తి వచ్చాడు. అపుడు అతడు ఆమె భర్తకు రూ.500లు ఇచ్చాడు. ఆ తర్వాత భర్త తనకు బయట కొంచెం పనుందని, ఆమెను ఫ్రెండ్‌ బైక్ మీద ఇంటికి వెళ్లమని చెప్పాడు. అది నమ్మి ఆమె అతడి బైక్ ఎక్కింది. అదే ఆమె చేసిన పొరపాటయింది.


అపుడు సోను ఆమెకు వేరే దారి నుంచి వెళ్దామని చెప్పి, నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ‘నీ భర్తకు డబ్బులిచ్చాననీ.. అతడే నిన్ను నాతో పంపాడు’ అని నిజం చెప్పాడు. దీంతో అసలు విషయం గ్రహించిన ఆ భార్య కంగుతింది. కట్టుకున్న భర్తే తనను మోసం చేయడం, ఇలాంటి నీచానికి పాల్పడటాన్ని ఆమె సహించలేకపోయింది. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికార్ రూరల్ పరిధికి చెందిన డిఎస్పీ రాజేష్ కుమార్ కేసును సీరియస్‌గా తీసుకుని 24 గంటల్లో నిందితుడిని, బాధితురాలి భర్తను అరెస్టు చేశారు. చట్ట ప్రకారం నిందితుడిని ఇప్పుడ కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-10-06T21:17:07+05:30 IST