6నెలల క్రితం ప్రేమ పెళ్లి.. భర్తతో కలిసి సరదాగా బయటికెళ్లిన గర్భిణి.. ప్రస్తుతం ఆసుపత్రిలో.. ఆమె మాటలు విని పోలీసులు షాక్..

Published: Wed, 23 Mar 2022 15:19:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
6నెలల క్రితం ప్రేమ పెళ్లి.. భర్తతో కలిసి సరదాగా బయటికెళ్లిన గర్భిణి.. ప్రస్తుతం ఆసుపత్రిలో.. ఆమె మాటలు విని పోలీసులు షాక్..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ప్రస్తుతం గర్భిణి. భర్తతో కలిసి సరదాగా బయటికొచ్చింది. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకోవడంతో.. ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తోంది.  ఈ క్రమంలో ప్రమాద ఘటన గురించి పోలీసులు ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాటలు విని విస్తుపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 25ఏళ్ల నేహా ఓ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేసేది. అక్కడ తనతోపాటే పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాన్ చంద్‌ను ఇష్టపడింది. నేహా అంటే గ్యాన్ చంద్‌కు కూడా ఇష్టం ఉంటంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొద్ది రోజులు ప్రేమించుకున్న తర్వాత ఇరువురూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో వారి పెళ్లై ఆరు నెలలు గడిచిపోగా.. నేహా గర్భం దాల్చింది. తాజాగా సోమవారం రోజు నేహా తన భర్త గ్యాన్ చంద్‌తో కలిసి ట్రైన్‌లో ఆమె లక్నోకు బయల్దేరింది. ఈ నేపథ్యంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భర్తతో ట్రైన్‌లో ఉండాల్సిన నేహా.. పట్టాల పక్కన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడి స్థానికుల కంటపడింది.


6నెలల క్రితం ప్రేమ పెళ్లి.. భర్తతో కలిసి సరదాగా బయటికెళ్లిన గర్భిణి.. ప్రస్తుతం ఆసుపత్రిలో.. ఆమె మాటలు విని పోలీసులు షాక్..

పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. నేహాను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగానే ప్రమాద వివరాలను అడిగిత తెలుసుకున్నారు. నేహా చెప్పిన మాటలు విని అధికారులు విస్తుపోయారు. అర్ధరాత్రి 3గంటల సమయంలో గ్యాన్ చంద్ తనతో గొడవకు దిగినట్టు తెలిపింది. ఈ క్రమంలో తన భర్తే తనను ట్రైన్ నుంచి కిందకు తోసేసినట్టు వెల్లడించింది. కొద్ది రోజులు తన భర్త, అతడి తల్లి కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు గ్యాన్ చంద్, అతడి తల్లిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.