పోలీసులకు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పిన మహిళ.. అర్ధరాత్రి ఆమె ఏం చేసిందో తెలిస్తే..

Published: Thu, 24 Mar 2022 12:01:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలీసులకు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పిన మహిళ.. అర్ధరాత్రి ఆమె ఏం చేసిందో తెలిస్తే..

ఆమె తన భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది.. అతను మత్తుగా నిద్రపోయాక అర్ధరాత్రి సమయంలో లేచి కత్తి తీసుకుని అతని గొంతులోనూ, పొట్టలోనూ కసిగా పొడిచి హత్య చేసింది.. తర్వాతి రోజు ఉదయం పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి లొంగిపోయింది.. రోజూ మద్యం సేవించి పిల్లల ఎదురుగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న భర్త పీడ వదిలించుకునేందుకు ఆమె అంత సాహసం చేసింది. 


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు సమీపంలోని నాగర్‌కు చెందిన జితేంద్ర 12 ఏళ్ల క్రితం దీప అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లే జితేంద్ర భార్యను, పిల్లలను హింసించేవాడు. భార్యపై, పిల్లలపై ప్రతిరోజూ చేయి చేసుకునేవాడు. అంతేకాదు పిల్లల ఎదురుగానే భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను కొట్టి, పిల్లల ఎదురుగానే ఆమెతో శృంగారం సాగించేవాడు. 


ఈ నెల 21వ తేదీన కూడా జితేంద్ర అలాగే ప్రవర్తించాడు. భార్యను, పిల్లలను దారుణంగా కొట్టాడు. దీంతో అతడిని చంపెయ్యాలని దీప నిర్ణయించుకుంది. రాత్రి భోజనంలో నిద్ర మాత్రలు కలిపేసింది. అతను నిద్రపోయాక అర్ధరాత్రి సమయంలో ఆమె కత్తితో అతడి గొంత కోసేసింది. తర్వాతి రోజు ఉదయం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయింది. భర్త వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని, అలా చేస్తే పిల్లలు పూర్తిగా అనాథలైపోతారని భయపడి భర్తను చంపేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పింది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.