హసీన్‌ దిల్‌రుబా నెట్‌ఫ్లిక్స్‌లో

Jun 4 2021 @ 01:16AM

తాప్సీ కథానాయికగా నటించిన ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదలకానుంది. ఈ విషయాన్ని తాప్సీ ఇన్‌స్టాలో టీజర్‌ వీడియోను విడుదల చేసి ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌లోనే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. థియేటర్‌ విడుదల కోసం ఇప్పటిదాకా వేచిచూశారు. కరోనా నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీ విడుదలకు చిత్రబృందం మొగ్గుచూపింది. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్‌ మాసే కథానాయకుడు. హర్షవర్ధన్‌ రాణే కీలకపాత్ర పోషించారు. వినీల్‌ మాథ్యూ దర్శకుడు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.