ముగిసిన హుజురాబాద్, బద్వేల్‌ ఉపఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-10-28T01:01:37+05:30 IST

హుజురాబాద్, బద్వేల్‌ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది.

ముగిసిన హుజురాబాద్, బద్వేల్‌ ఉపఎన్నికల ప్రచారం

హుజురాబాద్: హుజురాబాద్, బద్వేల్‌ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్లు లెక్కిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. బద్వేల్‌ ఉపఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. హుజురాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు. దేశంలోనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచార పర్వం సరికొత్త రికార్డుగా నిలువనున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే... ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో  టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ముందెన్నడూ లేని విధంగా ఐదునెలలపాటు కొనసాగిన ఈ ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడనున్నది. అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఏ ఎన్నికలు జరిగినా 15, 20 రోజులకు మించి ప్రచారాలు జరిగిన దాఖలాలు లేవు.


బద్వేలు ఉప ఎన్నిక తుది దశకు చేరింది. పోలింగ్‌కు మిగిలిన గడువు మూడు రోజులే. 30న ఓటరు తీర్పు ఇవ్వనున్నారు. త్రిముఖ పోటీ అనివార్యం కావడంతో ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు వాడి.. వేడి ప్రచారంతో ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినా.. అధికార పక్షం వైసీపీ నాయకుల్లో భయాందోళన నెలకొంది. 


ఈనెల 30 హుజురాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌

హుజురాబాద్‌లో మొత్తం ఓటర్లు 2,36,283

పురుష ఓటర్లు 1,18,720; మహిళా ఓటర్లు 1,17,563

మొత్తం 5 మండలాల్లో జరగనున్న ఉపఎన్నిక పోలింగ్‌

హుజురాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట...

కమలాపూర్‌ మండలాల్లో జరగనున్న ఉపఎన్నిక పోలింగ్‌

మొత్తం 306 కేంద్రాలు, 106 గ్రామపంచాయతీల్లో జరగనున్న పోలింగ్‌

నవంబర్‌ 2న హుజురాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు


బద్వేల్‌ ఉపఎన్నికకు 281 పోలింగ్‌ కేంద్రాలు

బద్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292

పురుష ఓటర్లు 1,07,915; మహిళా ఓటర్లు 1,07,355

బద్వేల్‌ నియోజకవర్గంలో 22 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలు మోహరింపు

Updated Date - 2021-10-28T01:01:37+05:30 IST