కోడ్ ఎఫెక్ట్.. దళిత బంధుకు సీఈసీ బ్రేక్

ABN , First Publish Date - 2021-10-19T01:31:34+05:30 IST

ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని..

కోడ్ ఎఫెక్ట్.. దళిత బంధుకు సీఈసీ బ్రేక్

హుజూరాబాద్: ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోను కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.


కాగా సీఎం కేసీఆర్.. దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు.  ఈ పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేశారు. 




Updated Date - 2021-10-19T01:31:34+05:30 IST