హైదరాబాద్‌లోని గల్లీల్లో బైక్‌పై Collector.. ఇదే తొలిసారి.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2021-09-06T16:13:38+05:30 IST

అది రసూల్‌పురాలోని గన్‌బజార్‌. అక్కడి కమ్యూనిటీ హాల్‌లోని

హైదరాబాద్‌లోని గల్లీల్లో బైక్‌పై Collector.. ఇదే తొలిసారి.. ఎందుకంటే..!

హైదరాబాద్‌ సిటీ : అది రసూల్‌పురాలోని గన్‌బజార్‌. అక్కడి కమ్యూనిటీ హాల్‌లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు ఆదివారం కలెక్టర్‌ శర్మన్‌ వెళ్లారు. టీకాలను పరిశీలించిన ఆయన ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను తనిఖీ చేయాలని భావించారు. అయితే గన్‌బజార్‌లో చిన్న చిన్న వీధులు కావడంతో కారు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కలెక్టర్‌ కారును పక్కకు పెట్టించారు. అక్కడే ఉన్న ఉద్యోగిని బైక్‌ తీయమన్నారు. వెనకాల కూర్చుని గన్‌బజార్‌లోని పలు ఇళ్లను సందర్శించారు. ఆయా ఇంటి సభ్యులతో మాట్లాడి వ్యాక్సిన్‌ తీసుకున్నారా, లేదా ఆరా తీశారు. అధికారులు వచ్చి ఇంటికి స్టిక్కర్‌ అంటించారా, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నారా అని తెలుసుకున్నారు. ఇలా ఒకటి, రెండు ఇళ్లు కాదు.. సుమారు 20 ఇళ్లకు పైగా సందర్శించారు. జిల్లా పరిపాలనాధికారి హైదరాబాద్‌లోని గల్లీల్లో బైక్‌పై పర్యటించి ప్రజల బాగోగులను పరిశీలించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల సందర్శనలో కలెక్టర్‌తోపాటు డీఎంహెచ్‌ఓ వెంకటి కూడా ఉన్నారు.

Updated Date - 2021-09-06T16:13:38+05:30 IST