‘సైన్స్‌ కోర్స్‌’తో బంగారు భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-03-01T08:54:30+05:30 IST

సైన్స్‌ కోర్స్‌ చదువులో స్కూల్‌, ఇంటర్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌) గొప్ప వేదిక అని, సైన్స్‌ కోర్స్‌(డిగ్రీ, పీజీ)తో కెరీర్‌లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు.

‘సైన్స్‌ కోర్స్‌’తో బంగారు భవిష్యత్తు

విద్యార్థులకు ఐఐఎ్‌సఈఆర్‌ గొప్ప వేదిక: వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సైన్స్‌ కోర్స్‌ చదువులో స్కూల్‌, ఇంటర్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌) గొప్ప వేదిక అని, సైన్స్‌ కోర్స్‌(డిగ్రీ, పీజీ)తో కెరీర్‌లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం జాతీయ సైన్స్‌ డే సందర్భంగా సైన్స్‌ కోర్స్‌ ప్రాధాన్యాన్ని, ఐఐఎ్‌సఈఆర్‌ విశిష్టతను వివరిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. అత్యున్నత స్థాయిలో విద్యా బోధన జరిగే ఈ సంస్థలో రాష్ట్ర విద్యార్థులు ప్రవేశం పొందాలని, తద్వారా సైన్స్‌లో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఏడేళ్లుగా ఈ కోర్సులు సాగుతున్నప్పటికీ రాష్ట్ర విద్యార్థులు ప్రవేశాలు పొందడం లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శిలకు వినోద్‌ లేఖ రాశారు.

Updated Date - 2021-03-01T08:54:30+05:30 IST