మారేడుపల్లి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద తొక్కిసలాట

Jul 30 2021 @ 11:56AM

హైదరాబాద్: సికింద్రాబాద్ మారేడ్‌పల్లి వాక్సినేషన్ సెంటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. రెండో డోస్ కోసం గత వారం రోజులుగా  ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ మారేడ్‌పల్లి వ్యాక్సినేషన్ సెంటర్ గేట్లను ఒకేసారి తెరవడంతో గందరగోళం నెకలొంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.