హైదరాబాద్‌లో నకిలీ ఇన్స్‌పెక్టర్ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-18T15:59:28+05:30 IST

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నకిలీ ఇన్స్‌పెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో నకిలీ ఇన్స్‌పెక్టర్ అరెస్టు

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నకిలీ ఇన్స్‌పెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం సిఐ పేరుతో ఒక వైద్యుడికి ఫోన్ చేసి రూ. 75 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే గతంలో డాక్టర్ ఇంట్లో డ్రైవర్‌గా పని చేసిన మహేష్ అనే వ్యక్తి వద్ద వైద్యుడికి సంబంధించిన కాల్ రికార్డింగ్‌లు ఉండటంతో అతనిని విధుల్లో నుంచి తొలగించారు. దీంతో మహేష్ తనకు తెలిసిన వ్యక్తితో నకిలీ పోలీస్ అవతారం ఎత్తించి వైద్యుడికి ఫోన్ చేయించి రూ. 75 లక్షలు ఇవ్వకుంటే ఆడియో రికార్డింగ్‌లు బయట పెడుతానని బెదిరించాడు. దీంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు పక్క ప్లాన్‌తో మాటు వేసి నకిలీ ఇన్స్‌పెక్టర్‌ను పట్టుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-08-18T15:59:28+05:30 IST