హైదరాబాద్: వృద్ధురాలిపై మూకుమ్మడి దాడి

ABN , First Publish Date - 2021-01-25T13:43:46+05:30 IST

కుటుంబ వివాదాల నేపధ్యంలో ఇంట్లోకి జొరబడి వృద్దురాలిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: వృద్ధురాలిపై మూకుమ్మడి దాడి

హైదరాబాద్: కుటుంబ వివాదాల నేపధ్యంలో ఇంట్లోకి జొరబడి వృద్దురాలిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో వృద్ధురాలు సహా ఇంట్లో ఇతర సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే... బాధితులదే తప్పు అంటూ పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఈరోజు రాచకొండ కమిషనర్‌ను బాధితులు కలువనున్నారు.

Updated Date - 2021-01-25T13:43:46+05:30 IST