హైదరాబాద్‌లో భారీ మనీ సర్క్యులేషన్ స్కామ్ గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-03-06T19:05:03+05:30 IST

నగరంలోని భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్‌ను సైబరాబాద్ ఎకనామకిల్ ఆపన్స్ వింగ్ బయటపెట్టింది.

హైదరాబాద్‌లో భారీ మనీ సర్క్యులేషన్ స్కామ్ గుట్టురట్టు

హైదరాబాద్: నగరంలోని భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్‌ను సైబరాబాద్ ఎకనామకిల్ ఆపన్స్ వింగ్ బయటపెట్టింది. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్టు గుర్తించారు. మనీ స్కీమ్ గ్యాంగ్ దాదాపు రూ.1500 కోట్ల డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్స్ సహా 24 మందిని  పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.20 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సాయంత్రం మూడు గంటలకు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2021-03-06T19:05:03+05:30 IST