కేటీఆర్‌ పీఏనంటూ మోసం...మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-06T19:11:04+05:30 IST

మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది.

కేటీఆర్‌ పీఏనంటూ మోసం...మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

హైదరాబాద్: మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. మంత్రి కేటీఆర్ పీఏనంటూ నాగరాజు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలతో పాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లను లక్షల రూపాయలకు నాగరాజు మోసం చేశాడు. నాగరాజును అరెస్టు చేసిన పోలీసులు... అతని నుండి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిది కార్పోరేట్ కంపెనీలను మోసం చేశాడు. బంజారాహిల్స్, ఓయు, సనత్‌నగర్‌, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరులలోనూ కేసులు నమోదు అయ్యాయి. నాగరాజుపై పీడీ యాక్ట్ నమోదు అయ్యింది. 2018 నుండి అతడిపై కేసులు ఉన్నాయి. ఇంటర్ స్టేట్ క్రిమినల్‌ అయిన నాగారజు.. క్రికెట్ కిట్‌లను ఫ్రీగా ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-03-06T19:11:04+05:30 IST