రైలు పట్టాలపై మందుబాబుల తిష్ఠ

Jun 16 2021 @ 11:04AM

అర్ధరాత్రి వరకూ మద్యం తాగుతూ వెకిలిచేష్టలు

పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం 


హైదరాబాద్/అడ్డగుట్ట: తుకారాంగేట్‌ చౌరస్తాలోగల ఆర్మీ రైలు పట్టాలపై సాయంత్రం సమయంలో మందుబాబులు మద్యం తాగుతున్నారు. అటువైపు రాకపోకలు సాగిస్తున్న మహిళలు, యువతులపై మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని మహిళలు అంటున్నారు. మద్యం తాగి ఖాళీ సీసాలను బస్తీలోకి విసిరేస్తున్నారంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకూ తాగుతున్నారని, అడిగితే మీ ఇంట్లో తాగమంటారా అంటున్నారని అన్నారు. మందుబాబులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

Follow Us on: